కొంతమంది ఎంత అందంగా ఉన్న సరే మెడ నల్లగా ఉంటుంది. ఎన్ని బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగిన సరే నల్లటి మెడ తెల్లగా అవ్వదు. అందంగాను కాదు. ఈ నల్లటి మెడ కారణంగా మేకప్‌ వేసుకునేప్పుడు మెడ భాగంలో ఉండే మృదువైన చర్మం మీద చాలామంది దృష్టిపెట్టరు. దాంతో అక్కడ గీతలు ఏర్పడి వయసు పెరిగినట్టుగా కనిపిస్తారు. 

                          

మెడ భాగంలో గీతల్ని మాయం చేయాలంటే... ఇక్కడ నిపుణులు చెప్పిన సలహాలను పాటించి మీ మెడను అందంగా కాపాడుకోండి. 

                          

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు ముఖంతో పాటు మెడకు కూడా సన్‌స్ర్కీన్‌ రాసుకోండి. సన్‌స్ర్కీన్‌ వాడడం వల్ల చర్మం మీద ముడతలు, గీతలు ఏర్పడవు. దాంతో చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

                       

అలాగే స్నానం చేసిన తరువాత మెడకూ మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల మెడ భాగంలోని చర్మానికి పోషణ, తేమ అంది ఎంతో అందంగా తయారవుతారు. 

                     

ముఖ సౌందర్యానికి ఫేస్‌మాస్క్‌ వాడతారు కదా. అలాగే మెడకు కూడా నెక్‌ ప్యాచెస్‌ వేసుకోవాలి. ఈ ప్యాచెస్‌ మెడ మీది గీతల్ని, ముడతల్ని తగ్గిస్తాయి అలాగే చర్మానికి తాజాదనాన్ని అందిస్తాయి. 

                         

చూశారుగా.. ఇక్కడ ఉన్న కొన్ని చిట్కాలను ఉపయోగించి అందమైన కోమలమైన మెడను మీ సొంతం చేసుకోండి.. అందంగా తయారవ్వండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: