మృదువైన చర్మం ప్రతి అమ్మాయి ఈ కోరిక తప్పకుండా కోరుకుంటుంది. కారణం.. ఈ మృదువైన చర్మం అనేది అందరూ కోరుకుంటారు. చర్మం కోమలంగా ఉండటం ఆ ఫీల్ ఏ వేరు. అలాంటి ఈ చర్మం అందంగా కోమలంగా ఉండాలి అంటే కొన్ని చిట్కాలు తప్పక పాటించాలి. అందులో ఈ చిట్కాలు కొన్ని. 

                                     

మేక్‌పను తొలగించడానికి ఆయిల్‌ బేస్డ్‌ క్లీన్సర్‌ లేక కొబ్బరి నూనెను ఉపయోగించాలి. ఇది మేక్‌పను తొలగిస్తుంది.

                              

చర్మం ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా తేనె కాపాడుతుంది. రెండు టీస్పూన్ల ఆరెంజ్‌ జ్యూస్‌లో రెండు టేబుల్‌స్పూన్ల తేనె కలిపి ముఖానికి రాస్తే మొటిమలు దరి చేరకుండా ఉంటాయి.

                            

ఆలివ్‌ ఆయిల్‌తో ముఖాన్ని ఒక నిమిషం మర్ధన చేసి, ఆపై నీటితో శుభ్రం చేస్తే మృదువైన చర్మం సొంతమవుతుంది.

   

ఈ సీజన్‌లో అలొవెరా ఉన్న మాయిశ్చరైజర్‌ వాడటం ఉత్తమం. అలొవెరాలో ఔషధగుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

 

కోడిగుడ్డు పచ్చసొనలో ఒక టీస్పూన్‌ ఆరెంజ్‌ జ్యూస్‌, ఒక టీస్పూన్‌ ఆలివ్‌ఆయిల్‌, కొంచెం రోజ్‌వాటర్‌, కొన్నిచుక్కల లెమన్‌జ్యూస్‌ వేసి బాగా కలిపి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

 

రాత్రివేళ సహజంగానే చర్మం మరమత్తులు చేసుకుంటుంది. మాయిశ్చరైజింగ్‌ చేస్తే ఈ ప్రక్రియకు మరింత తోడ్పాటునందిస్తుంది. క్రమం తప్పకుండా మాయిశ్చరైజింగ్‌ చేయడం వల్ల ముడతలు క్రమంగా తొలగిపోతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: