తలస్నానం చెయ్యడం వల్ల జుట్టు ఎంతో ఆరోగ్యంగా అందంగా ఉంటుంది. అలాంటి ఈ జుట్టు అందానికి సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.. తలస్నానం ఒకటి రెండు సార్లు కాదు వారానికి మూడు సార్లు తలా స్నానం చెయ్యాలి. అప్పుడే జుట్టు అందంగా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే తలస్నానం ఉదయం చేస్తే మంచిదా ? లేక సాయింత్రం వేళలో చేస్తే మంచిదా అనే విషయం ఇప్పుడు చదివి తెలుసుకుందాం. 

 

రాత్రి సమయంలో తలస్నానం చేయడం వల్ల తల తడిగా ఉన్నప్పుడే పడుకుంటారు. అయితే, తడి జుట్టు త్వరగా ఊడుతుంది. పడుకున్న సమయంలో అటు ఇటూ తిరుగుతూ ఇష్టమైన పొజిషన్‌లో పడుకుంటారు. దీంతో జుట్టు ఎక్కువగా చిక్కుబడి.. ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాన్ని తప్పక గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్త తీసుకోవాలి. 

 

తలస్నానం చేసి రాత్రి పడుకున్నప్పుడు.. తలగడ, బెడ్‌కి వెంట్రుకలు ఎక్కువగా అంటుకుంటాయి. దీంతో అవి కూడా తడిగా మారి బ్యాక్టీరియా ఎక్కువగా తయారవుతుంది. దీని వల్ల జుట్టు సమస్యలు మరింత తీవ్రం అవుతాయి. దీంతో పాటు తడి జుట్టుతో రాత్రి వేళల్లో పడుకున్నప్పుడు జుట్టు మొత్తం ముద్దలా తయారవుతుంది కాబట్టి తలస్నానం ఉదయం వేళల్లో చేయడం మంచిది అని వైద్య నిపుణులు చెప్తున్నారు. 

 

రాత్రి సమయాల్లో తలస్నానం చేసి పడుకోవడం వల్ల అలర్జీలు పెరిగి తలసమస్యలు ఎక్కువగా మారతాయి. ఎందుకంటే తలస్నానం చేయడం వల్ల జుట్టు తేమగా ఉండి చుండ్రు, జుట్టురాలడం, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ జుట్టు ఊడిపోవడానికి కారణంగా మారతాయి అని వైద్య నిపుణులు చెప్తున్నారు. చూశారుగా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. అందుకే రాత్రి సమయంలో తల స్నానాలు చెయ్యకండి. చేస్తే జుట్టు అరే వరుకు జాగ్రత్తలు తీసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: