మనం ఎక్కడ ఉన్న సరే అందమైన జుట్టు మనకు కావాలి అనుకుంటాం.. ఎంత కష్టమైన సరే వత్తైన జుట్టు.. నల్లటి జుట్టు కావాలి అనుకుంటాము అందుకే మనం ఎన్నో చిట్కాలు ఉపయోగిస్తాం. కానీ చాలా చిట్కాలు పని చేయవు. అయితే ఇక్కడ మాత్రం సహజసిద్ధమైన చిట్కాలు ఉన్నాయి. అవి ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

ఆలుగడ్డ తురుమును పిండితే వచ్చిన రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో గుడ్డు సొన, పెరుగు వేసి బాగా కలపాలి. ఈ ప్యాక్‌ను కుదుళ్ల నుంచి జుట్టంతా పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత గోరు వెచ్చటి నీళ్లతో కడిగి షాంపూతో తలస్నానం చేయాలి. ఇరవై రోజులకి ఒకసారి ఇలా చేస్తే ఆర్యోగవంతమైన మెరిసే జుట్టు సొంతమవుతుంది.

 

ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడిచేయాలి. అవి ఉడుకుపట్టగానే బంగాళా దుంప పొట్టు వేసి ఇరవై నిమిషాలు ఉడికించాలి. ఆ నీటిని వడకట్టాలి. షాంపూతో తలస్నానం చేశాక వడకట్టిన నీళ్లతో జుట్టు కడగాలి. ఇది జుట్టుకు సహజసిద్ధమైన నలుపు రంగుని ఇస్తుంది. ఇలా చేస్తుంటే జుట్టు తెల్లబడే సమస్య నుంచి బయటపడొచ్చు.

 

జుట్టు విపరీతంగా ఊడిపోతుందా... ఈ సమస్యకి కూడా బంగాళా దుంప పడుతుంది. బంగాళాదుంప, కలబంద రసాలను సమానంగా తీసుకొని 21 టీస్పూన్ల తేనెలను తీసుకోవాలి. వీటన్నింటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి జుట్టు అంతటా పట్టించి రెండు గంటలు ఉంచుకోవాలి. ఆ తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: