కాలానికి అనుగునంగా ఒక్కొక కాలంలో కొన్ని రకాల కూరగాయల ,పండ్ల రకాలు వస్తు ఉంటాయి .అట్లా సీజన్లో వాచీ ఫుడ్  తీసుకోవడం వళ్ళ హెల్త్ కి చాల మంచిది అని మనం వింటూ ఉంటాం ప్రస్తుతం చలి కాలం కావున చలి కాలం లో దొరికే ఒక కూరగాయ గురించి మనం తెలుసుకొందాం  ఉసిరి కాయంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో...ఎందుకంటే ఉసిరికాయతో రకరకాల వంటలు, ఊరగాయలు తయారుచేస్తారు.  

 

ఇందులో ఉండే ఆరోగ్యప్రయోజనాలు తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది .  ఇవి రుచికి  పుల్లగా, వగరుగా ఉంటాయి. ఆకుపచ్చగా ఉండే వీటిలో ఔషధ గుణాలు కూడా ఎక్కువగా  ఉంటాయి. ఈ ఉసిరికాయలో విటమిన్ సి, మరియు విటమిన్ ఐ పుష్కలంగా ఉంటుంది. ఉసిరి కాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్ళను, బెరడును ఆయుర్వేద ఔషధాలలో  ఉపయోగిస్తారు .అందుకే దీన్ని ప్రకతి ప్రసాధించిన వరం అంటుంటారు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యనైనా అద్భుతంగా నివారించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

 

 
ఉసిరి ఉపయోగాలు :-ఈ జ్యూస్ ను ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఒకే మోతాదులో తీసుకోవడం వల్ల నిజమైన ప్రయోజనాలు ఎన్నో ఆ జ్యూస్ ను ఉపయోగించి ఆరోగ్యాన్ని అందాన్ని కాపాడుకోండి.దీనిలో అద్బుతమైన యాంటి ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల వృద్ధాప్యంను దరిచేరనివ్వదు. తేనెతో కలపి ఆమ్లా జ్యూస్ ను త్రాగడం వల్ల ముఖం ఎల్లప్పుడు తాజాగా మెరుస్తుంటుంది.మెటిమల నివారణకు: ఆమ్లా జ్యూస్ చర్మసమస్యలను పోగొట్టడంలో అద్బుతంగా పనిచేస్తుంది. ముఖంలో ఏర్పడ్డ మొటిమలని, మచ్చలని తగ్గిస్తుంది.

 

ఉసిరి తీనటం వలన శరీరంలోని అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు, అలాగే నిధానంగా బరువు కూడా తగ్గించుకోవచ్చు.ఉసిరికాయ తినటం లేదా ఆమ్లా జ్యూసును త్రాగడం వల్ల ఆడవాళ్ళలో ఉండే నెలసరి సమస్యలు తగ్గుతాయి.ఆమ్లా జ్యూసును క్రమం తప్పకుండా చూసుకోవడం వల్ల ఎర్రరక్తణాలను పెంచి, తగిన శక్తిని అందిస్తుంది. ఉసిరి రసం వల్ల ఒంట్లోని వ్యాది నీరోదక శక్తీ పెరుగుతుంది.

 

 

ఆమ్లా జ్యూసును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఐసైట్ బాగా మెరుగుపడుతుంది..మధుమేహం: ఉసిరి కాయలో క్రోమియం అధికంగా ఉంటుంది. దీని వలన మధుమేహాన్నిఅదుపులో ఉంచుతుంది. ఉసిరికాయ జ్యూస్ తో కొద్దిగా పసుపు కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.ఉసిరి రసం గుండెను బలంగా తయారుచేస్తుంది. గుండె కండరాలను గుండె సంబంధిత సమస్యలకు దివ్వఔషదంగా పనిచేస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: