జుట్టు ఊడిపోవడం, పొడిబారిపోవడం, చిట్లిపోవడం, చుండ్రు రావడం, చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం.. ఇలాంటి సమస్యలతో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. వీటి నుంచి బ‌య‌ట ప‌డ‌డానికి ఎన్నో విధాలుగా ట్రై చేస్తుంటారు. కానీ.. లాభం లేక స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. అయితే సాధారణంగా నువ్వులు భారతీయ వంటకాలలో అరుదుగా వినియోగిస్తుంటారు. ముఖ్యంగా పండుగల సమయంలో వాటి వాడకం ఎక్కువ. కానీ.. నువ్వుల నూనె వంటల్లోనే కాదు చర్మ సౌందర్యానికి, జుట్టు సౌందర్యానికి కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

 

నువ్వుల నూనెతో కేశాలకు మరియు తలకు బాగా పట్టిస్తే , హెయిర్ సెల్స్ యాక్టివ్ గా ఉండే హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది.  ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. నువ్వుల నూనె వెంట్రుకలకు సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. నువ్వుల నూనెలోని ప్రయోజనాల వల్ల తలను కాంతివంతంగా మార్చుతుంది. తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. 

 

దాంతో హెయిర్ ఫోలీ సెల్స్ పెంచుతుంది మరియు చిట్లిన జుట్టును నివారిస్తుంది. నువ్వుల నూనెలో ఉండే ఔషధ గుణాలు తలలో పేలను కూడా నివారిస్తుంది. రెగ్యులర్ గా తలకు షాంపు చేయడానికి ముందు నువ్వుల నూనెను అప్లై చేసి మర్ధన చేయాలి. ఇది ఫంగల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను దూరం చేస్తుంది. చాలా వరకూ జుట్టు సమస్యలు చుండ్రువల్లనే ఎదురవుతాయి . చుండ్రు సంబంధిత సమస్యలను నివారించడానికి ఒక అద్భుతమైన మార్గం నువ్వుల నూనె.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: