బియ్యం నీళ్లు.. మనం వంట చెయ్యాలి అంటే మొదట బియ్యాన్ని శుభ్రంగా కడుగుతాం. ఆలా కడిగి బియ్యంలోని శక్తిని అంత నేలపాలు చేస్తాం. అయితే ఈ బియ్యం కడిగిన నీళ్లతో ఎలాంటి లాభాలు ఉంటాయి.. అనేది.. ఆ నీళ్లతో చర్మానికి, వెంట్రుకలకు  ఎంతవరుకు లాభం ఉంటుంది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

బియ్యం శుభ్రంగా కడిగి కప్పు లేదా రెండు కప్పుల నీళ్లు పోసి పావు గంట సేపు నానబెట్టాలి. తర్వాత బియ్యం బాగా పిసికి, వడగట్టాలి. ఇలా సేకరించినవే బియ్యం నీరు. ఈ నీటిని వెంట్రుకలకు పట్టిస్తే, జుట్టు మెరుస్తూ ఉంటుంది. కుదుళ్లు కూడా బాగా బలపడతాయి.

 

ముఖానికి పట్టిస్తే మొటిమల కారణంగా ఎర్రబడిన చర్మం మామూలుగా మారుతుంది. తెరుచుకుని ఉన్న చర్మ రంధ్రాలు మూసుకుని, చర్మం బిగుతుగా మారుతుంది.

 

బియ్యం నీటిలోని పోషకాల వల్ల చర్మం జీవం సంతరించుకుంటుంది. నునుపుగా, ఆరోగ్యవంతంగా మారుతుంది.

 

చర్మం మీద దద్దుర్లు, మంటలు లాంటి చర్మ సమస్యలు తగ్గుతాయి. ఎండకు కమిలి నల్లబడిన చర్మం తిరిగి మామూలుగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: