యువతీ యువకులకు యుక్త వయసు రాగానే మొటిమలు వచ్చేస్తాయి.. ఆ వచ్చిన మొటిమలు వచ్చినట్టే వెళ్లవు.. అవి మళ్ళి తిరిగి వచ్చేస్తాయి. అలాంటి మచ్చలు మాయం అవ్వాలని చాలా మంది చాల రకాల చిట్కాలను, క్రిములను ఉపయోగిస్తారు.. కొంతమంది మేకప్ తో కవర్ చెయ్యాలనుకుంటారు.. 

 

కానీ ఆ కాస్మెటిక్స్ ఎన్ని పాటించిన సరే ఆ మొటిమలు పోవు.. మచ్చలు పోవు. అయితే అలాంటి మొటిమల మచ్చలు తగ్గాలంటే ఇక్కడ ఉన్న సహజమైన ఫేస్ మాస్క్ చిట్కా ఉపయోగించండి. మీ మొటిమల మచ్చలు పోగుట్టుకోండి.. అందంగా తయారవ్వండి. ఆ ఫేస్ మాస్క్ చిట్కా ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావలసిన పదార్థాలు... 

 

నీళ్లు - ఒక కప్పు, 

 

ఓట్‌ మీల్‌ - అర కప్పు, 

 

నిమ్మరసం - నాలుగు చుక్కలు, 

 

దాల్చిన చెక్క పొడి - 1 టీస్పూను. 

 

తయారీ విధానం.. 

 

గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. ఓట్‌ మీల్‌, నిమ్మరసం కలపాలి. చల్లారిన తర్వాత దాల్చిన చెక్క పొడి కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. మెత్తని వస్త్రంతో తుడుచుకుని, మాయిశ్చరైజర్‌ పూసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే మొటిమల తాలూకు మచ్చలు మటుమాయం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: