ఆహార పౌష్టికత పరంగా బంగాళదుంపలలో కార్బోహైడ్రేటులు ప్రధానమైన ఆహార పదార్థం. బంగాళ దుంపలో విటమిన్-సి, విటమిన్- బి6, పొటాషియం పుష్కలంగా ఉండమే కాదు, కొద్ది మెత్తంలో థయామిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ లాంటి మూలకాలు లభిస్తాయి. అంతేకాదు ఇందులో కార్టినాయిడ్స్, పాలీఫినాల్స్ లాంటి ఫైటో రసాయనాలు ఉన్నాయి. ఇక బంగాళదుంప తొక్కలో ఉన్న పీచు పదార్ధం కూడా చాలా ఉపయోగకరం. బంగాళాదుంప తినేందుకు రుచిగా ఉండటమే కాదు, అందానికి అడ్డుగా నిలిచే ఎన్నో సమస్యల్ని తీరుస్తుంది.

 

అలాగే జుట్టు ఆరోగ్యానికి కూడా బంగాళాదుంప ఎంత‌గానూ ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనికి  బంగాళాదుంప నుంచి కొంచెం రసం తీయాలి. దానికి కోడిగుడ్డు తెల్లసొనను, కొంచెం నిమ్మరసాన్ని కలిపి జుట్టుకు, మాడుకు పట్టించాలి. ఇలా చేస్తే వెంట్రుకలు ఆరోగ్యవంతంగా, దృడంగా తయారవుతాయి. ఇలా త‌ర‌చూ చేస్తుంటే మంచి ఫ‌లితం ల‌భిస్తుంది. అలాగే బంగాళాదుంప రసంతో రోజూ ముఖాన్ని కడుక్కుంటే ముడతలు రావడం తగ్గుతుంది.

 

ముఖంపై వచ్చే తెల్లమచ్చల్లాంటివి కూడా పోతాయి. ఎండకి కమిలిపోయి బొబ్బలెక్కిన చర్మానికి బంగాళాదుంప రసాన్ని రాసిన చర్మం మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. అలాగే ఎవరి ముఖంలోనైనా మొదట ఆకర్షించేవి కళ్లే. అయితే కళ్ల చుట్టూ నల్లటి వలయాలు రావడం, కళ్లు ఉబ్బడం లాంటివి ఇబ్బంది పెట్టే సమస్యలు. బంగాళాదుంపని ముక్కలుగా చేసి జ్యూసర్‌లో వేస్తే కొంచెం జ్యూస్‌ వస్తుంది. దానిలో దూది ముంచి, కళ్లపై పావుగంట సేపు ఉంచుకోండి. ఇలా రోజూ చేస్తూ ఉంటే నల్లని వలయాలు తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: