పూర్వం రోజుల్లో వయసు పైబడిన వారికి మాత్రమే  జుట్టు రాలే సమస్య ఉండేది. కాని ప్రస్తుత రోజుల్లో వయసుతో ఏ మాత్రం సంబంధం లేకుండా అన్ని వయసుల వారిని వేదిస్తున సమస్య హెయిర్ ఫాల్. స్త్రీ, పురుష బేధం లేకుండా ఈ సమస్య అందరిని ఇబ్బంది పెడుతోంది. జుట్టు ఊడిపోవడానికి అనేకరకాల కారణాలు ఎన్నో ఉన్నాయి. శరీర తత్వం వలన జుట్టు కొందరికి ఊడిపోతుంటే మరికొందరికి వారి అజాగ్రత్త వల్ల జుట్టు ఊడిపోతుంది. అయితే ప్రస్తుత కాలంలో మాత్రం జుట్టు ఊడిపోవడానికి ప్రధాన కారణం కలుషిత వాతావరణ ప్రభావంతో పాటు, ఆహరపు అలవాట్లు అంటున్నారు నిపుణులు. మరి ఇటువంటి పరిస్థితుల్లో జుట్టుని ఎలా సంరక్షించుకోవాలో కొన్ని చిట్కాల రూపంలో చూద్దాం.

 

ఆరోగ్యకరమైన జుట్టు కోసం చిట్కాలు :

 

పొల్యుషన్ ఉన్న ప్రదేశాలలో తిరిగేటప్పుడు ఖచ్చితంగా తలని స్కార్ఫ్ లేదా టోపీ తో కప్పి ఉంచాలి. తలలో ఎక్కువగా దుమ్ము చేరుకున్నప్పుడు తల స్నానం చేయటం ఎంతో మంచిది. అయితే తల స్నానం చేసేవారు తప్పకుండా కుకుండు కాయలు లేదా, షీకాయ షాంపూ కానీ, వాడితే ఇంకా మంచిది. రసాయనిక షాంపూలు వాడి జుట్టు పాడు చేసుకోవడం కంటే కూడా ఇవి ఎంతో మేలైనదని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

 

పూర్వం తలకి నిండుగా నూనె వాడేవారు. ఇది జుట్టుని నల్లగా నిగనిగలాడేలా చేయడంలోనూ, జుట్టుని బలంగా మార్చడంలో ఎంతో ఉపయోగపడేది. కానే ఇప్పుడు నూనె వాడటానికి ఇష్టపడటంలేదు  ఎందుకంటే నూనె జుట్టుని జిడ్డుగా చేస్తుంది, అందంగా కనిపించదని. కాని జుట్టుని ఎప్పటికప్పుడు తేమగా ఉంచటం చాల అవసరం. నూనె రాయడానికి ఇష్టపడని వాళ్ళు తలస్నానం చేసే ముందు రోజు బాదం ఆయిల్ ని తలకి మసాజ్ చేసి మర్నాడు ఉదయం తలస్నానం చేయటం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ ఇళ్ళలోనో, లేదా మీ భందువుల ఇళ్ళలోనో బామ్మలు ఉంటారు వారిని అడిగితే పూర్వం జుట్టు సంరక్షణకై ఎలాంటి సహజసిద్ద పద్దతులు పాటించే వారో చెప్తారు. ఆ చిట్కాలు పాటించి మీ జుట్టుని ఎంతో ధృడంగా, పట్టులా మార్చుకోవచ్చు.  

 

 

 



 

 

మరింత సమాచారం తెలుసుకోండి: