చర్మం మాములుగా ఉన్న సమయంలో మనకు ఎం అంత ఎఫెక్ట్ అనిపించదు కానీ.. ఎప్పుడైనా పెళ్ళికి లేదా ఏదైనా ఫంక్షన్ కు వెళ్ళినప్పుడు అనిపిస్తుంది.. ఎందుకు ఇంత జిడ్డు జిడ్డుగా ఉన్నాం.. మన ముఖాన్ని అందంగా మార్చుకోలేమా ? ముడతలు, మచ్చలు తగ్గాలంటే ఎం చెయ్యాలి అని... 

 

అయితే మచ్చలు, ముడతలు తగ్గి చర్మం మెరవాలంటే చర్మపు తేమను తగ్గించకుండా, మచ్చలు, ముడతలను తగ్గించే ఫేస్‌ ప్యాక్‌ వేసుకోవాలి. ఇందుకోసం బ్యూటీ పార్లర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ప్యాక్‌ తయారుచేసుకుని వేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

బంగాళాదుంపను ముక్కలుగా తరిగి, రెండు టీస్పూన్ల రోజ్‌వాటర్‌ చేర్చి, పేస్ట్ ల తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖం మీద పూసుకుని, ఆరిన తర్వాత కొద్ది నీళ్లతో తడిపి వేళ్లతో మసాజ్‌ చేయాలి. ఇలా చెయ్యడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. 

 

జిడ్డు చర్మం కలిగినవారైతే ఇదే మిశ్రమంలో ఒక టేబుల్‌స్పూను నిమ్మరసం కలిపి వాడాలి.

 

పొడి చర్మం కలిగినవారైతే ఒక టేబుల్‌ స్పూను తేనె కలిపి వాడాలి.

 

నార్మల్‌ స్కిన్‌ కలిగినవారు తేనె, నిమ్మరసం సమపాళ్లలో కలిపి వాడుకోవచ్చు.

 

చూశారుగా.. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ చిట్కాలు పాటించి మీ చర్మాన్ని సురక్షితంగా కాపాడుకోండి.. ఆరోగ్యంగా తయారు చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: