సాధార‌ణంగా మెంతిని భార‌తీయ‌ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీన్ని ఆకు రూపంలోనూ, మెంతులను స్పైస్ గానూ ఉపయోగిస్తారు. ఇక ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ వాడతాం. అయితే మెంతుల‌ను కేవలం వంట‌ల్లోనే కాదు.. అనేక విధాలుగా ఉప‌యోగించ‌వ‌చ్చు. ముఖ్యంగా చ‌ర్మ సౌంద‌ర్యానికి మెంతులు ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

 

అందుకు కొన్ని మెంతులను.. నీళ్లలో మరిగించి చల్లారిన తరువాత ఆ నీటిలో  దూది ని ముంచి మొటిమలు ఉన్న ప్లేస్ లో అప్లై చేయాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత ఫేస్ క్లీన్ చేసుకుంటే.. మెంతులలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉండడం వలన ఈ సమస్యనుండి ఉపశమనం కలిగిస్తుంది. చాలా సార్లు జుట్టు నిర్జీవంగా మారుతుంది.. అలాంటి సమయంలో మెంతులను పెరుగులో నానబెట్టి.. ఉదయాన్నే గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని తలకి పట్టించి ఆరాకా నీటితో తలని కడగాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పట్టుకుచ్చులా మెరవడమే కాకుండా బలంగా మారుతుంది. 

 

మెంతులు చర్మానికి మాయిశ్చరైజర్ ని అందించి డ్రై అవకుండా అడ్డుకుంటుంది. మెంతి పౌడర్ ని నీటిలో కలిపి.. చర్మానికి రాసుకోవడం వల్ల.. పొడిబారిన చర్మాన్ని అరికట్టవచ్చు. డెడ్ స్కిన్ సెల్స్ ని చాలా తేలికగా తొలగించడానికి మెంతులు సహాయపడతాయి. రంధ్రాలను కూడా.. మూసుకుపోయేలా చేస్తాయి. తేనెలో మెంతి పొడి కలిపి మిక్స్ చేసుకుని అప్లై చేస్తే.. మంచి ఫలితాలను పొందవచ్చు. సో.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి..!

 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: