జుట్టు... అమ్మాయికి అయినా.. అబ్బాయికి అయినా ఎంతో ముఖ్యం. ఈ జుట్టు కోసం యువతీ యువకులు ఎంతో కష్టపడతారు. జుట్టు అందంగా ఉంటె మనిషి అందంగా ఉంటారని యువతీ యువకుల ఫీలింగ్. అది నిజమేలే.. కానీ ఆ జుట్టును జాగ్రత్తగా కాపాడుకున్న అది మెరవదు. అలాంటి ఈ జుట్టుని ఎలా కాపాడుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. జుట్టుని ఆరోగ్యంగా కాపాడుకోండి. 

 

వారానికి రెండు లేదా మూడుసార్లు షాంపూతో స్నానం చెయ్యండి.

 

శుభ్రమైన జుట్టు, సుకుమారమైన చర్మం కోసం ప్రతి రోజు రెండు పూటలా స్నానం చేయండి. 

 

క్రమం తప్పకుండా తలస్నానం చేయండి. ముఖ్యంగా స్విమ్మింగ్‌, ఎక్సర్‌సైజ్‌లు చేశాక తప్పకుండా తలస్నానం చెయ్యాలి.

 

జుత్తును అడ్డదిడ్డంగా కాకుండా స్ట్రెయిట్ గా దువ్వండి.. లేదంటే కొన్నిసార్లు దువ్వెన చర్మం కుదుళ్లను దెబ్బతీస్తుంది. 

 

చర్మం, కేశాలపై పేరుకుపోయిన మురికిని తొలగించటానికి స్కిన్‌, హెయిర్‌ స్క్రబ్‌లను ఉపయోగించాలి.

 

జుట్టుకు సరిపడా తేమను అందించేందుకు హెయిర్‌ మాస్క్‌ లేదా ఫ్రూట్‌ మాస్క్‌ను ఉపయోగించండి. 

 

జుట్టు కుదుళ్లలో సహజమైన నూనెలు ఉత్పత్తవుతాయి. దీనివల్ల జుట్టుకు పోషకాలు అంది ఆరోగ్యంగా పెరుగుతాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: