కొబ్బరి నీళ్ళు సహజంగా అందరూ ప్రతీ కాలంలో తాగుతారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ నీళ్ళు త్రాగడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది అందరికి తెలిసిందే. అయితే కొబ్బరి ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఎంతో దోహదపడతాయి. కానీ చర్మ సంరక్షకి కొబ్బరి నుంచీ వచ్చే కొబ్బరి పాలని వాడుతారు. కొబ్బరి పాలని సౌందర్య సాధనంగా వాడటం పూర్వీకులు ఆచరించే వారని  అంటున్నారు నిపుణులు. మరి కొబ్బరి పాలతో  చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలో ఇప్పుడు చూద్దాం..

 

ముఖ్యంగా కోమలమైన చర్మం కావాలనుకునే వారు కొబ్బరి పాలతో చర్మాని సంరక్షించే చిట్కాలని ఆచరిస్తే చాలు. ఎండాకాలంలో ఎండ ధాటికి చర్మం కమిలిపోయి ఎర్రగా మారుతుంది. అలాంటి సమయంలో కొబ్బరి పాలు తీసుకుని అందులో కొంచం దూది ముంచి చర్మంపై మర్దనా చేయాలి.ఇలా ఐదు నిమిషాలపాటు మర్దనా చేయడం వలన కందిన చర్మం ఎంతో సున్నంటగా పూర్వ రూపుకంటే కూడా మరింత నిగారింపు సంతరించుకుంటుంది.

 

గోరు వెచ్చని నీటిని ఒక కప్పు కొబ్బరి పాలు పోసి అందుకొన సరిపడినంత గులాబీ రేకులు వేసి, అందులోనే చెంచాడు తేనే ని వేసి బాగా కలపాలి. ఇలా కలిపినా నీటితో స్నానం చేస్తే చలి కారణంగా పొడి బారిన చర్మానికి తగినంతగా తేమ అందుతుంది. అంతేకాదు చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై పేరుకున్న కాలుష్యాన్ని, వ్యర్దాలని తరిమేయలన్నా సరే ఈ చిట్కా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: