సాధార‌ణంగా మార్కెట్లో మనకు ఎక్కువగా దొరికే పండ్లలో జామ ఒకటి. సి విటమిన్‌తో పాటూ ఎన్నో పోషకాలు అందించే జామవల్ల ప్రయోజనాలెన్నో ఉన్నాయి. జామ నుంచి అందే విటమిన్‌- సి వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.  ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడడంతోపాటు, బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలను దూరం చేస్తుంది. ఇలా అనేక అరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లిగి ఉన్న జామ సౌంద‌ర్య సాధ‌న‌ల‌కు ఎంతో చక్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.

 

దీని కోసం జామకాయను నీటి సాయంతో పేస్ట్‌లా త‌యారు చేసి దాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జామకాయలోని విటమిన్లు మీ చర్మాన్ని రిఫ్రెష్ చేసి మెరిసే రూపాన్ని ఇస్తాయి. కాంతివిహీనంగా, నిర్జీవంగా కనిపించే మీ చర్మాన్ని కాంతివంతంగా మరియు ప్రకాశవంతంగా మెరిపిస్తాయి. మ‌రియు జామ‌కాయ, తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. క‌నీసం 20 నిమిషాల త‌ర్వాత క్లిన్ చేసుకోవ‌డం వ‌ల్ల ముఖం మీద మొటిమలను, దద్దుర్ల నుండి ఉపశమనం చేయడానికి సహాయపడుతుంది.

 

అలాగే జామ‌లో ఉండే పోషకాల వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక జామకాయలోపల ఉండే తెల్లటి గుజ్జులో గుడ్డు తెల్లసొన కలిపి ముఖానికి రాసుకొని ఇరవై నిమిషాల తరువాత కడగాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ముడతలు పోవడమే కాకుండా చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. మ‌రియు జామ‌తొక్క తీసి పేస్ట్ చేసుకోవాలి. అందులో కాస్త తేనె క‌లిపి ముఖానికి ఫేస్ట్ వేసుకొని ప‌ది నిమిషాల త‌ర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జామకాయలో యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎలాంటి చర్మ సమస్యలైనా చిటికెలో మాయం చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: