అందం.. ఎవరికీ వద్దు. అందరికి కావాలి.. అందం కావాలి ఆరోగ్యం కావాలి. అలాంటి వారు ఈ చలికాలంలో కొన్ని చిట్కాలు తప్పక పాటించాలి. కేవలం ఫేస్ ప్యాక్ లే కాదు ఆరోగ్యమైన అందం కోసం కొన్ని కొన్ని కాయగూరలు, పండ్లు తప్పక తినాలి. అవి ఏంటి ? ఎందుకు? అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

ద్రాక్షపండ్లలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఈ ద్రాక్షపండ్లు పలు రకాల చర్మ సమస్యలను నివారిస్తాయి. ఈ ద్రాక్షపళ్లలో ఉండే లైకోపిన్‌ చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడి, మృదువుగా మారుస్తుంది.

 

క్యారట్‌లో విటమిన్‌ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి మంచి పోషణనిస్తాయి. చర్మ ముడతలు, రంగు పేలిపోవడం, మచ్చలు వంటివి ఏర్పడకుండా చేసుకుంటాయి.

 

పాలకూరలో ఐరన్‌ ఇది మంచి వనరు. దీనిలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్‌ ఇన్‌ఫెక్షన్లను నివారిస్తాయి. రక్తహీనతను దూరం చేసి చర్మానికి రంగునందిస్తాయి. 

 

బాదం డ్రై ఫ్రూట్‌ చర్మానికి తేమనందిస్తుంది. ఈ బాదంలోని విటమిన్‌ ఇ సూర్యకిరణాల బారి నుంచి చర్మానికి రక్షణనిస్తుంది. 

 

గ్రీన్‌ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒంట్లోని విషపదార్థాలను బయటకు పంపి చర్మానికి సహజ మెరుపుని అందిస్తుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: