ఉల్లిపాయ.. ఈకాలంలో కాస్టలీ కూరగాయ ఏంటి అంటే ? ఉల్లిపాయ అనే చెప్పాలి. ఎందుకంటే.. భారీ వర్షాల కారణంగా ఉల్లిధరలు కన్నీళ్లు పెట్టించాయి. అయితే అలాంటి ఉల్లిపాయతో అందంగా తయారవ్వచ్చు.. కేవలం వంటకే కాదు.. అందానికి కూడా ఉల్లి సాయం ఎంతో అవసరం అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. ఉల్లిని ఉపయోగించి ఎలా అందంగా తయారవ్వాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

బ్లాక్‌ పిగ్మెంటేషన్‌ కారణంగా ముఖచర్మం నల్లగా మారి, పొడిబారుతుంది అయితే ఈ సమస్య వదలాలంటే ఉల్లి రసంలో సెనగపిండి, మీగడ కలిపి ముఖం మీద అప్లై చేసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేస్తే పిగ్మెంటేషన్‌ తగ్గి చర్మం తెల్లగా మారుతుంది.

 

చర్మం నిర్జీవంగా తయారైతే ఉల్లి రసాన్ని నేరుగా ముఖం మీద పూసి, ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఉల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్‌, విటమిన్లు చర్మానికి సరిపడా పోషణను అందించి, ఆరోగ్యాన్ని సంతరించి పెడతాయి.

 

ఉల్లి రసం నొప్పి నివారిణి కూడా. కందిపోవడం, వాపును వంటి వాటిని కూడా తగ్గిస్తుంది. కాబట్టి దోమ కాటుకు, పురుగు కాటుకు కందిన ప్రదేశంలో ఉల్లి రసాన్ని పుస్తె వెంటనే తగ్గుతుంది. 

 

చూశారుగా.. ఉల్లి సో కాస్టలీ అయినప్పటికీ ఎంతో సహాయ పడుతుంది. ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ఈ ఉల్లిపాయ సహాయ పడుతుంది. మరి ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే ఈ ఉల్లితో అందాన్ని సొంతం చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: