అమ్మాయి.. అందం.. ఈ రెండిటికి చాలా ద‌గ్గ‌ర సంబంధం ఉంది. ఎందుకంటే అందంగా క‌నిపించ‌డానికి అమ్మాయిలు చేసే సాధ‌న‌లు అన్నీ ఇన్నీ కాదు. కొంత మంది న్యాచుర‌ల్ బ్యూటీసే అనుకోండి. అదే వేరే విష‌యం. అయితే అందంగా.. ఆక‌ర్ష‌నీయంగా క‌నిపించాల‌ని అంద‌రూ అనుకుంటారు. కానీ.. అది మ‌న మీదే ఆదార‌ప‌డి ఉంటుంది. ఎలా అంటే మ‌నం తీసుకునే జాగ్ర‌త్త‌లు.. టిప్స్ వ‌ల్ల అందాన్ని మ‌రింత రెట్టింపు చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా ఆముదం చ‌ర్మ సౌంద‌ర్యానికి ఎంతో చక్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.  

 

ఆముదం గింజల నుంచి ఈ నూనెను తీస్తారు. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇక ముందుగా ఆముదాన్ని ముకానికి అప్లై చేసి కాస్త స‌మ‌యం త‌ర్వాత క్లీన్ చేసుకోవ‌డాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మృతకణాల్ని తొలగిపోవడమే కాకుండా చర్మాన్ని తాజాగా మారుస్తుంది. ఆముదాన్ని నిత్యం తలకు రాసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. చర్మానికి రాసుకుంటే చర్మం పగలకుండా ఉంటుంది. అలాగే కొబ్బ‌రి పాలు, ఆముదం క‌లిపి త‌ల‌కు ప‌ట్టించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

 

చుండ్రు నివారణకు ఇది మంచి ఎంపిక. జుట్టును కాంతివంతంగా మెరిసిసేట్లు చేసే వాటిలో కొబ్బరి పాలు, ఆముదం నూనె మిశ్రమం ఒకటి.  అలాగే పొడిబారిన పెదాలకు ఆముదాన్ని రాస్తే, అవి మృదువుగా మారుతాయి. తరచూ కత్తిరిస్తున్నా జుట్టు చివర్లు చిట్లుతుంటాయి చాలామందికి. అలాంటి వారికి ఆముదం చాలా చక్కగా పని చేస్తుంది. ఆముదాన్ని వేడి చేసి గోరువెచ్చగా అయ్యాక జుట్టుకు పట్టించాలి. గంటయ్యాక తలస్నానం చేస్తే సరి. ఇలా చేయడం వల్ల జుట్టుకు కుదుళ్ల నుంచి చివరి వరకూ పోషణ లభిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: