దంతాలు... మన చిరునవ్వుకు అందాన్ని ఇస్తాయి.. అలాంటి దంతాలను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందంగా ఉంచుకోడానికి ఎన్నో చిట్కాలు పాటించాలి. అయినప్పటికీ ఆరోగ్య సమస్యల వల్ల.. నీళ్లు మారడం వల్ల మన దంతాలు రంగు మారిపోతాయి. దంతాలు మేరవాలంటే ఎన్నో చిట్కాలు పాటించాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న దంతాలు రంగు మారటం.. ఆహారపు అలవాట్ల వల్ల దంతాలు పసుపుపచ్చగా మారతాయి. అయితే అలాంటి సమస్యలన్నింటికి చెక్ పెట్టి దంతాలను ఎలా మెరిపించాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

అరటిపండు తొక్కలో ఉండే సన్నని పొరలతో దంతాలను రెండు నిమిషాలు రుద్దుకుంటే దంతాలు మెరుస్తాయి. 

 

స్ట్రాబెర్రీ లేదా స్ట్రాబెర్రీ టూత్‌ పేస్టుతో దంతాలు శుభ్రం చేసిన దంతాలు మెరుస్తాయి.

 

పాల ఉత్పత్తులు దంతాల రంగు తగ్గడాన్ని నిరోధిస్తాయి.

 

యాపిల్స్‌, క్యారెట్లు, ఆకుకూరలు దంతాలపై ఉన్న మచ్చలను పోగొడుతాయి. 

 

టీ, కాఫీ, సాఫ్ట్‌ డ్రింక్స్‌ తాగేటప్పుడు స్ట్రా ఉపయోగించడం వల్ల దంతాలపై వాటి ప్రత్యక్ష ప్రభావం పడదు. అందుకే దంతాలు మెరిసిపోతాయి. 

 

హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, బేకింగ్‌ సోడాతో చేసిన లిక్విడ్‌ పేస్టును వాడడం వల్ల దంతాలు తళ తళ మెరుస్తాయి.

 

తిన్న తర్వాత నీళ్లతో నోటిని బాగా పుక్కిలిస్తే కూడా దంతాలపై మచ్చలు పడవు.. మెరుపు తగ్గదు.

 

తులసి ఆకులు, కమలాపండు తొక్కు రెండింటి మిశ్రమాన్ని బాగా కలిపి దంతాలపై రుద్దితే దంతాలు తళ తళ మెరుస్తాయి.

 

చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి దంతాలను మెరిసేలా చేసుకోండి.. చిరునవ్వుతో ఆకట్టుకోండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: