సాధార‌ణంగా బియ్యప్పిండిని త‌ర‌చూ వంట‌ల్లో వాడుతూనే ఉంటారు. అయితే తినే ఆహార పదార్ధంగా మాత్రమే బియ్య‌ప్పిండి అందరికి తెలుసు కానీ ఈ పిండితో అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చని మీలో ఎంతమందికి తెలుసు. చాలా మంది అందం కోసం అంటూ చాలా రకాల క్రీములు, లోషన్లు వాడేస్తుంటారు. కానీ వాటివలన ప్రయోజనం ఉండదు. పైగా సైడ్‌ ఎఫెక్టులు కూడా ఉంటాయి. అందాన్ని, ఆరోగ్యాన్నీ అవి దెబ్బతీస్తాయి. అయితే బియ్యం పిండిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని తాజాగా మార్చేలా చేస్తాయి. 

 

దాంతో పాటు చర్మ లావణ్యాన్ని పెంచుతుంది. ఇందులో చర్మంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడే గుణంతో పాటు, చర్మంను సాఫ్ట్ గా మరియు యూత్ ఫుల్ గా కనబడేందుకు తేమను పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి. దీనికి ముందుగా బయటకి వెళ్ళేటప్పుడు బియ్యం పిండిని, కార్న్‌ స్టార్చ్‌తో కలిపి పౌడర్‌లా రాసుకుంటే ముఖం నుంచి ఆయిల్‌ ను పీల్చుకోని ఫ్రెష్‌లుక్‌ ను ఇస్తుంది. మ‌రియు బియ్యం పిండి, అలోవెర జెల్, తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమలతో పోరాడి ఇన్ల్ఫ‌మేషన్ నుండి ఉపశమనం కలిగిస్తాయి. 

 

అదే విధంగా తేనెలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కూడా మొటిమలకు దారితీసే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అదే విధంగా, . బియ్యంపిండి, ఎగ్‌ వైట్‌ , తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల స్కిన్‌ టైట్‌గా మారుతుంది. అలాగే బియ్యం పిండి,చిదిమిని అరటిపండు, ఆముదం నూనె క‌లిపి ఫేస్‌కు అప్లై చేయాలి. అరటిపండు చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా కళ్ళ క్రింద భాగంలో నలుపు తొలగించి కాంతిని ప్రేరేపిస్తుంది.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: