మన అందాన్ని కురులతో కూడా పోల్చి చూస్తుంటారు. కురులు వత్తుగా నల్లగా ఉంటే మంచి ఆరోగ్యంగా కూడా ఉన్నట్లే.   పాతికేళ్లు రాకముందే జుట్టు తెల్లబడటం ప్రస్తుతం సాధారణం అయిపోయింది. పెరిగిన ఒత్తిడి, హార్మోన్ల ప్రభావం, కాలుష్యం వంటి కారణాల వల్ల జుట్టు రాలడంతోపాటు తెల్లగా మారుతోంది. అంతేకాదు జుట్టు తక్కువగా ఉన్నా సరే బాగుంటే చాలు అనుకునే వారు తెల్లజుట్టు రావడంతో మరింతగా ఆందోళనకు గురవుతున్నారు. యుక్త వయసులోనే వెంట్రుకలు తెల్లబడటం వల్ల చూసేందుకు పెద్ద వాళ్లలా కనిపిస్తారు. దీంతో తెల్లజుట్టు కనిపించకుండా ఉండటానికి చాలా మంది జుట్టుకు రంగేస్తుంటారు. కృత్రిమ రంగుల వల్ల జుట్టు నల్లగా మారినప్పటికీ... ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు నిపుణులు.

 

అయితే ఇలాంటి వారు ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే ఈజీగా తెల్ల జుట్టుకు స‌హ‌జ సిద్ధంగా చెక్ పెట్ట‌వ‌చ్చు. దీని కోసం ముందుగా బ్లాక్‌ టీతో తెల్ల జట్టును నల్లగా మార్చుకోవచ్చు. బ్లాక్‌ టీ పొడిని నీటిలో మరిగించి  గోరువెచ్చగా అయ్యాక తలకు రాసుకోవాలి. గంట సేపు అయ్యాక తలస్నానం చేయాలి. మ‌రియు అల్లం రసంలో కొద్దిగా ఆలివ్‌నూనె చేర్చి జుట్టు కుదళ్లకు పట్టించాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత‌ తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు దృఢంగా, న‌ల్ల‌గా మార‌తుంది. కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా మసాజ్ చేయాలి. 

 

ఇది తెల్లజుట్టుకు మసాజ్ థెరఫీలా పనిచేసి తెల్ల జుట్టును నివారిస్తుంది. మెంతుల‌ను నీటితో రాత్రంతా నాన‌బెట్టి మార్నింగ్ ఆ నీటితో త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారేందుకు స‌హాయ‌ప‌డుతుంది. కోడిగుడ్డు, కీరదోస, రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌ను మిక్సీలో వేసి పేస్టులా చేయండి. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి పదిహేను నిమిషాలపాటు ఉంచి తర్వాత షాంపూ చేసుకోండి. నెలకోసారి ఇలా చేయడం వల్ల జుట్టు దృఢంగా, న‌ల్ల‌గా మారుతుంది.
 


 

మరింత సమాచారం తెలుసుకోండి: