సాధార‌ణంగా పుదీన వంట‌ల్లో త‌ర‌చూ వాడుతుంటారు.  పుదీనా ప్లేవర్ ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌రు కూడా. అయితే పుదీనా వంట‌ల్లోనే కాదు.. అనేక సౌంద‌ర్య సాద‌న‌ల్లో కూడా వాడుతుంటారు. ముఖ్యంగా దీన్ని ముఖ సౌందర్యానికి వినియోగించుకుంటే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీని కోసం ముందుగా కొన్ని పుదీనా ఆకులలో చిటికెడు పసుపు, కొన్ని చుక్కలు రోజ్ వాటర్ వేసి ముద్ద చేయండి. దీనిని ముఖానికి, మెడకు రాసుకుని పదిహేను నిమిషాల పాటు ఆరనిచ్చి, నీటితో కడిగేయండి. 

 

ఇలా చేయ‌డం వ‌ల్ల పుదీనా ఆకులలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మరియు ఇతర గుణాలు వలన మృతకణాలను తొలగిపోతాయి. ఇవి బాక్టీరియాను చంపి చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యవంతంగా చేయడం వలన మేనిఛాయ మెరుగుపడుతుంది. అలాగే పుదీనాలో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుండటం వల్ల ఇది తలలో కూడా చర్మం ఆరోగ్యంగా ఉండేట్లు చేస్తుంది.  గుడ్డులోని తెల్లసొనకు కొన్ని పుదీనా ఆకుల పేస్టు కలిపి దానిని ముఖానికి రాసుకున్నా మచ్చలూ, మొటిమలూ రాకుండా ఉంటాయి. 

 

పుదీనాలో ఉండే శాలిసైలిక్ ఆమ్లం మొటిమలు రాకుండా చేస్తుంది. మ‌రియు కొన్ని పుదీనా ఆకులను తీసుకుని నీళ్లలో వేసి మరిగించండి. దీనిని బాగా చల్లార్చి.. ఆ నీటిని ముఖానికి రాసుకోండి. ఇలా చేయ‌డం వ‌ల్ల పుదీనా ఆకులకు చర్మంపై ముడుతలు మరియు సన్నని గీతలను పోగొట్టే లక్షణాలు ఉన్నాయి. ఇవి ముఖంపై నుండి ఫ్రీరాడికల్స్ ను తొలగించి, చర్మాన్ని వయసు మీరడం నుండి సంరక్షిస్తుంది. పుదీనా రసానికి, బొప్పాయి రసం కలిపి చర్మ వ్యాధులు వచ్చిన చోట రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: