సాధార‌ణంగా కొబ్బ‌రి నూనెను చాలా మంది జుట్టుకు రాసుకునేందుకు వాడుతారు. అయితే కేవ‌డం జుట్టుకే మాత్ర‌మే కాకుండా అనేక సౌంద‌ర్య సాద‌న‌ల్లో కొబ్బ‌రి నూనె గ్రేట్‌గా ప‌నిచేస్తుంది. ఇక అందం విషయంలో ఏ చిన్న లోపం ఉన్నా అస్సలు రాజీ పడరు అమ్మాయిలు. ముఖ్యంగా ముఖంలో నల్లమచ్చలు, మొటిమలు వంటి విషయంలో హైరానా పడిపోతుంటారు. అయితే అలాంటి స‌మ‌స్య‌ల‌న్నిటికి కొబ్బ‌రి నూనె చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌తి రోజు రాత్రి పూట నిద్రించే ముందు కొద్దిగా కొబ్బ‌రినూనె తీసుకుని ముఖానికి రాసుకోవాలి. దీంతో ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై వ‌చ్చే ముడ‌తలు పోతాయి.

 

చర్మ కణాలను బలోపేతం చేయడానికి మరియు స్కిన్ ఎలాసిటి పెంచడానికి కొబ్బరి నూనె, కలబంద మరియు కీరదోసకాయ వంటి కాంబినేషన్ ఉపయోగించవచ్చు. ఈ మూడిటి మిశ్ర‌మాన్ని ఫేస్ అప్లే చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. కొబ్బరి నూనె అప్లై చేసే రోజుల్లో ముఖానికి మాయిశ్చరైజర్ ను అప్లై చేయకపోవడమే మంచిది. కొబ్బరి నూనె ఫ్రీరాడికల్స్ డ్యామేజ్ ను నివారించడం వల్ల ముఖంలో ముడుతలను సులభంగా తొలగించుకోవచ్చు. కాలిన గాయాలకు కొబ్బ‌రినూనె అద్భుతంగా ప‌నిచేస్తుంది. 

 

సంబంధిత ప్ర‌దేశంపై ఎప్ప‌టిక‌ప్పుడు కొబ్బ‌రినూనెను రాస్తుంటే దాంతో కాలిన గాయం త్వ‌ర‌గా మానుతుంది. కొబ్బరి నూనె, ఆముదం నూనె మిశ్రమాన్ని కొన్ని చుక్కలను అరచేతిలో తీసుకుని రెండు చేతులను రబ్ చేసి ముఖానికి అప్లై చేసి సున్నితంగా.. ముఖం మొత్తం అప్లై చేయాలి. ఇలా ఫ్రీక్వెంట్ గా చేస్తుంటే సాగిన మీ చర్మంలో తప్పనిసరిగా మార్పు కనబడుతుంది. కొబ్బ‌రి నూనె, ఎగ్ వైట్ క‌లిపి ముఖానికి అప్లే చేయాలి. గుడ్డు సాగిన చర్మంను టైట్ గా మార్చుతుంది ముడుతలను పోగొడుతుంది,. అదే విధంగా కొబ్బరి నూనె ఏజింగ్ లక్షణాలు కనబడకుండా ఆలస్యం చేస్తుంది.  
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: