మొటిమలు.. భలే ఇబ్బంది పెడుతాయి. యుక్త వయసు వచ్చిందంటే మెరిసి పోవాలనుకుంటారు.. కానీ ఈ మొటిమలు మాత్రం ఆలా మెరవనివ్వవు.. అబ్బా.. మీరు మెరిస్తే మేము చూస్తూ ఊరుకోవాలా ? అని అనుకుంటాయో ఏమో.. ఆలా అని కాదులే మనం తీసుకునే ఆహారం వల్ల మనకు మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే అలా వచ్చిన మొటిమలు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి.. అందంగా కనిపించండి.. ఏమి ఏమి తినాలి అంటే.. 

 

చర్మం లోపల పేరుకుపోయిన బ్యాక్టీరియా, ఇతర క్రిములు బయటకు విడుదల అవ్వడం వల్ల మొటిమలు బాగా వస్తాయి. బచ్చలికూర వంటి ఆకుకూరల్లో రక్తంలోని బ్యాక్టీరియా, క్రిములను నాశనం చేసే క్లోరోఫిల్‌ ఉంటుంది అంతేకాదు బచ్చలి కూరలో విటమిన్‌-ఎ ఎక్కువగా ఉంటుంది.

 

పసుపు చర్మం మంటను తగ్గిస్తుంది. అలాగే చర్మం కాంతివంతంగా మెరవడానికి ఉపయోగపడుతుంది. సహజసిద్ధమైన యాంటీబయాటిక్‌ అయిన పసుపును ఏదో ఒక రూపంలో రోజుకు పావు చెంచా చొప్పున తప్పనిసరిగా తీసుకోవాలి. దీంతో రక్తంలోని హానికరమైన బ్యాక్టీరియా నాశనమై మొటిమలు రాకుండా సహాయపడుతుంది.

 

క్యారెట్ లో బీటా కెరోటిన్‌ రూపంలో విటమిన్‌-ఎ అధికంగా ఉంటుంది. అది మొటిమలకు కారణమయ్యే క్రిములను నాశనం చేస్తుంది. అందుకే ప్రతిరోజూ కనీసం ఒక క్యారెట్‌ తినాలి. అప్పుడే మొటిమలు రావు.. 

 

చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె, చర్మం వంటి అవయవాలు ఆరోగ్యంగా ఉండేట్టు చేస్తుంది. 

 

చూశారుగా.. ఇలా ఆరోగ్యవంతమైన ఆహారం తిని మొటిమలను,  మచ్చలను పోగొట్టుకోండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: