ముల్లంగిని కొందరు ఇష్టపడరు కానీ ఇది పోషకాల ఖజానా అంటున్నారు ఆహార నిపుణులు. ఇక ముల్లంగి భూమిలో పండుతుంది కాబట్టి దీన్ని రూట్ వెజిటేబుల్ అంటారు. ఇది ఎక్కువగా శీతాకాలంలో లభిస్తుంది. కానీ, ప్రస్తుతం అభివృద్ధి చెందిన వ్యవసాయ విధానాల వల్ల ముల్లంగి సంవత్సరం మొత్తం లభిస్తోంది. వీటిని కూర, సలాడ్‌, పప్పులో వేసుకోవచ్చు. ముల్లంగిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ముల్లంగిలో ఉండే మినరల్స్, విటమిన్స్ మన చర్మం మరియు జుట్టుకు తగిన పోషణను అందివ్వడంలో ఎంతగానో సహాయపడగలవని సౌందర్య నిపుణులు సూచిస్తుంటారు.

 

ఇందులో ముందుగా ముల్లంగి గింజలను మెత్తగా రుబ్బి పొడిలా చేసుకోవాలి. దీనికి కొన్ని చుక్కల నీటిని జోడించి.. ఈ పేస్ట్ ను మీ ముఖం మీద అప్లై చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కారణంగా, మీ చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి కాపాడి, చర్మం నుండి మురికిని మరియు మలినాలను తొలగిస్తుంది. మ‌రియు తురిమిన ముల్లం, పెరుగు, బాదం నూనెను ముఖానికి అప్లే చేయాలి.

 

ఇలా చేయ‌డం వ‌ల్ల చర్మాన్ని హైడ్రేట్ గా, సాఫ్ట్ గా మరియు మృదువుగా ఉంచడంలో ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇక ముల్లంగిలో ఉండే విటమిన్ సి, ఫాస్పరస్, విటమిన్ బి కాప్లెక్స్, జింక్ వంటివి చర్మ సమస్యలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముల్లంగిని మాయిశ్చరైజర్‌గా ఉపయోగిస్తారు. ఫేస్ ప్యాక్ గాను ఉపయోగించడం వల్ల చర్మాన్ని అందంగా మార్చుతుంది. ముల్లంగి రసాన్ని తీసుకుని ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బ్లాక్ హెడ్స్, మొటిమలు మొదలైన చ‌ర్మ స‌మ‌స్య‌లు ఈజీగా తొలిగిస్తుంది.
  

మరింత సమాచారం తెలుసుకోండి: