అమ్మాయిలు అందరూ మెరిసిపోయే ముఖం కావాలి అనుకుంటారు కానీ చాలామందికి అది సాధ్యం కాదు అయితే ముఖం ఎలా చేస్తే మెరుస్తుంది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. ఈ చిట్కాలను పాటించండి ముఖంను అందంగా మార్చుకోండి. 

 

పసుపు, కలబంద గుజ్జు, టీ ట్రీ ఆయిల్‌, నిమ్మరసాలను కలిపి ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత చల్లనీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మొటిమలు క్రమంగా తగ్గుతాయి.

 

పసుపు, రోజ్‌ ఆయిల్‌, గుడ్డు తెల్లసొనలను కలిపి ముఖానికి పూసుకోవాలి. పది నిమిషాల తర్వాత కడిగేసుకుంటే, చర్మం తాజాగా మారుతుంది. 

 

పసుపు, విటమిన్‌-ఇ నూనె, కలబంద గుజ్జు కలిపి కళ్ల కింద అప్లై చేసి, ఆ తర్వాత కడిగేస్తే నల్లని వలయాలు తగ్గు ముఖం పడుతాయి.

 

పసుపు, నిమ్మరసం లేదా నారింజ రసం, తేనె సమపాళ్లలో కలిపి ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత కడిగితే చర్మపు నలుపు తగ్గు ముఖం పడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: