ఫేస్ ప్యాక్.. మనం ఎంత మేకప్ వేసిన న్యాచురల్ గా అందంగా ఉండాలి కదా ? అలాంటప్పుడు ఏం చెయ్యాలి ? అప్పుడప్పుడు న్యాచురల్ ఫేస్ ఫ్యాక్స్ వేస్తూ ఉండాలి.. అందుకే ఈ న్యాచురల్.. అదోరకమైన ఫేస్ ప్యాక్ ను వేసుకోండి.. ఎలా.. ఫేస్ ప్యాక్ ను ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

బియ్యం కడిగి లేదా గంజి వార్చి ఆ నీటిని చర్మ, కేశ సౌందర్యాన్ని పెంచే విటమిన్లు, లవణాలు ఎక్కువగా ఉంటాయి.  

 

బియ్యం నీళ్లలోని ఫెరూలిక్‌ యాంటీ ఆక్సిడెంట్‌ చర్మానికి పోషణనిస్తుంది. బియ్యం నీళ్లలో ముంచిన కాటన్‌ ప్యాడ్‌తో ముఖం మీద రుద్దుకోవాలి. ఆరిన తరువాత నీళ్లతో కడుక్కోవాలి. వారంలో రెండు రోజులు ఇలా చేస్తే చర్మం సున్నితంగా మారుతుంది.

 

ఈ నీరు ముఖం మీది ఎర్రటి మచ్చలను తొలగించి, ముఖానికి తాజాదనాన్ని, నిగారింపును తెస్తుంది.

 

బియ్యం నీళ్లను వెంట్రుకలకు పట్టిస్తే, అవి దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. బియ్యం నీళ్లతో కురులను తడుపుకొని, ఆరాక నీటితో శుభ్రం చేసుకోవాలి.

 

చూశారుగా.. ఈ చిట్కాలను పాటించి మీ అందాన్ని మరింత పెంచుకోండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: