అందంగా.. ఆరోగ్యంగా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు. దాని కోసం ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఇక ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంలోనే కాదు, నేటి తరుణంలో ప్రతి ఒక్కరు తమ అందం పట్ల కూడా శ్రద్ధ వహిస్తున్నారు. పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా ఇప్పుడందరూ తమ సౌందర్యాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించారు. అందంగా కనబడాలంటే ముఖంలో ఎలాంటి మొటిమలు, మచ్చలు, చారలు, వలయాలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు గుమ్మ‌డికాయ గ్రేట్‌గా ప‌నిచేస్తుంది.

 

చర్మ సంరక్షణకు , చర్మ సమస్యలను ప్రభావంతంగా తొలగించి, చర్మంతో కాంతిని నింపడానికి గుమ్మడి ఉపయోగపడుతుంది. గుమ్మడి కాయలో విటమిన్ ఎ, సి, ఇలు పుష్కలంగా ఉన్నాయి. గుమ్మడి లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ చర్మ కణాలను పునరుత్తేజపరుస్తాయి. మ‌రి అందంగా క‌నిపించ‌డానికి ముందుగా ఒక స్పూన్ గుమ్మడికాయ పేస్ట్ లో ఒక స్పూన్ తేనే కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మం రాసి.. పావు గంట‌ తర్వాత వేడి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమలు,నల్లని మచ్చలు తగ్గుతాయి. గుమ్మడికాయ పేస్ట్, బాదం నూనె క‌లిపి ముఖానికి అప్లై చేయాలి.

 

ఇలా చేయ‌డం వ‌ల్ల ఫేస్ ఫ్రేష్‌గా, కాంతివంతంగా మారుతుంది. కంటి క్రింద, కంటి చుట్టూ ఉండే బ్లాక్ సర్కిల్స్ ను తొలగించడానికి గుమ్మడి మరియు తేనె ప్రభావంతంగా పనిచేస్తుంది. ఒక స్పూన్ గుమ్మడికాయ గుజ్జులో రెండు స్పూన్ల నిమ్మరసం క‌లిపి ఫేస్‌కు అప్లై చేయాలి. పావు గంట త‌ర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే ప్రకాశవంతమైన ఛాయ మీ సొంతం అవుతుంది. సో.. గుమ్మడికాయను డైలీ స్కిన్ కేర్ లో భాగం చేసుకోవడం, స్పా ట్రీట్మెంట్లో సగం బ్యూటీ బెనిఫిట్స్ పొందొచ్చు.
   
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: