మనం యవ్వనంగా మెరిసిపోవాలంటే... కొన్ని ఆరోగ్యకరమైన చిట్కాలు పాటించక తప్పదు! ఎప్పుడు ఫేస్ వాష్ లు.. ఫేస్ ప్యాక్ లు.. ఫేస్ మాస్కులు మాత్రమే కాకుండా.. కొన్ని ఆరోగ్యకరమైన చిట్కాలు కూడా పాటించండి.. అప్పుడే కదా! ఆరోగ్య కరంగా.. అందంగా కనిపించేది.. వంటింట్లో దొరికే దినుసులతో అందంగా కనిపించడం ఎలా అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

ఆలా చర్మం యవ్వనంగా కనిపించడానికి తేనే.. పాలు.. పెరుగు ఎంతో ఉపయోగ పడుతాయి. అయితే అవి ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

తేనెలో శక్తివంతమైన సహజ మాయిశ్చరైజర్‌ ఉంటుంది. తేమను అందించి చర్మాన్ని పొడిబారనీయకుండా చూసుకుంటుంది. అంతేకాదు పొడిచర్మం గలవారు తేనె రాసుకుని 20 నిమిషాలయ్యాక నీళ్లతో శుభ్రం చేసుకుంటే చర్మం పొడిబారదు. 

 

టీస్పూన్‌ తేనెలో, టీస్పూన్‌ రోజ్‌వాటర్‌, టీస్పూన్‌ పాలపొడి వేసి పేస్ట్‌లా చేసుకొని ముఖానికి రుద్దుకున్నా కూడా చర్మం తాజాగా మారుతుంది. 

 

జిడ్డు చర్మం ఉంటే రోజ్‌వాటర్‌, టీస్పూన్‌ నిమ్మరసం, సగం టీస్పూన్‌ తేనె వేసి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.

 

పాలులో ప్రొటీన్లు, కొవ్వులు, లవణాలు చర్మానికి యవ్వనాన్ని ఇస్తాయి. గాజు సీసాలో సగం కప్పు పాలు, అయిదు చుక్కల ఆలివ్‌, నువ్వుల నూనె వేసి మిక్స్‌ చేసి కాటన్‌బాల్‌తో ముఖం మీద నెమ్మదిగా రుద్దుకోవాలి.దీని వల్ల మలినాలు, నల్లమచ్చలు తొలిగిపోతాయి. 

 

పెరుగులో లాక్టిక్‌ ఆమ్లం చర్మం పీహెచ్‌ను ఒకేస్థాయిలో ఉంచుతుంది. రెండు టీస్పూన్ల పెరుగులో చిటికెడు పసుపు వేసి ముఖానికి రాసుకోవాలి. ఈ మిశ్రమం మెరుపునిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: