సాధార‌ణంగా చింత‌పండు తెలియ‌ని వారుండ‌రు. సాంబార్, రసం, పులియోగరే.. రెసిపీ ఏదైనా కాస్తంత చింతపండు పులుపు తగాలాల్సిందే. ఎలాంటి వంటకానికైనా చింతపండు విభిన్నమైన రుచిని అందిస్తుంది. చింతపండులో ఫైబర్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే చింతపండు హెల్తీ ఇంగ్రిడియంట్ గా మారింది. అలాగే చింత‌పండును త్రేన్పులు, కడుపు ఉబ్బరం, జ్వరం, వికారం మొదలైన రోగాలకి మందులా వాడతారు. అయితే చింత‌పండు వంట‌ల‌కు, ఆరోగ్యానికే కాదు.. చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.

 

దానికి ముందుగా వేడి నీటిలో చింతపండును పావుగంట‌ పాటు నానబెట్టాలి. నానిన చింతపండు నుంచి గుజ్జును తీసి చిటికెడు పసుపు పొడి కలపాలి. దాని ముఖానికి అప్లే చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై మ‌చ్చ‌లు తొల‌గి కాంతివంతంగా మారుతుంది. అలాగే చింత‌పండు మీ చర్మానికి పోషణ అందించి, మాయిశ్చరైజ్ చేసి, చర్మాన్ని మృదువుగా మరియు మెత్తగా చేస్తుంది. అంతేకాక చింతపండు మీ స్కిన్ టోన్ని మెరుగుపరుస్తుంది. చింత‌పండు గుజ్జు, పెరుగు, కాస్త ఉప్పు క‌లిపి ముఖానికి అప్లై చేయాలి.

 

ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ట్యాన్ తొల‌గ‌తుంది.చింతపండు చర్మాన్ని టోనింగ్ చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. మరియు ఇది ఇంట్లో ఉండే టోనర్లలో, ఇది అత్యంత మంచి ఎంపికల్లో ఒకటిగా ఉంటుంది. ఇది ప్రధానంగా యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. క్రమంగా యుక్తవయసులో వృద్దాప్య చాయలు రాకుండా అడ్డుకుంటుంది. చింతపండు ఆక్నే సమస్య, మొటిమలు మరియు మచ్చల చికిత్సలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యను తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: