నిజానికి మనమందరమూ మన చర్మం స్పష్టంగా, నిష్కల్మషంగా, కాంతివంతంగా, ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యవంతంగా ఉండాలని ఆశిస్తుంటాం. అయితే దీనికి విరుద్దంగా అనేక చ‌ర్మ స‌మ‌స్య‌లు ఎదుర్కొంటాం. ఇదే క్ర‌మంలోనే ర‌క‌ర‌కాల క్రీమ‌లు, ఫేస్ వాషులు ఇలా ఎన్నో వాడుతుంటారు. వీటివలన ఆశించిన ఉపయోగాలు లేకపోగా, దుష్ప్రభావాలు మాత్రం అధికంగా ఉంటాయి. అయితే రోజూ ఉదయం రాత్రి కొన్ని రకాల ఇంటి చిట్కాలు పాటిస్తే మీ అందం ఎప్పటికీ చెరగకుండా ఉంటుంది. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి మ‌రి.

 

ఉదయం లేచిన తర్వాత కొద్ది సేపటికి ముఖాన్ని కచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల రాత్రంతా ముఖంపై పేరుకుపోయిన జిడ్డు పోతుంది. అలాగే బ్యాక్టీరియా మొత్తం కూడా పోతుంది. ముఖానికి కావాల్సిన రక్తప్రసరణ అందుతుంది. అరటి పండు, తేనె క‌లిపి ఫేస్‌కు అప్లే చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చర్మాన్ని తేమగా చేయడంతో పాటుగా, అధికంగా విడుదల అవుతున్న జిడ్డు లేదా సెబం నియంత్రించడంలో సహాయం చేస్తుంది. అలాగే పెరుగు, శ‌న‌గ‌పిండి, ప‌సుపు క‌లిపి ఫేస్ అప్లే చాయాలి.

 

ఇలా చేయ‌డం వ‌ల్ల చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది మరియు ప్రకాశవంతంగా చేస్తుంది. ప‌సుపు మ‌రియు పాలు క‌లిపి ఫేస్‌కు అప్లై చేయాలి. ఇది చర్మాన్ని మృదువుగా చేసేందుకు సహాయపడుతుంది, చెడు బ్యాక్టీరియాను తొలగించి చర్మాన్ని ఆరోగ్యకరమైన స్థితిలో ఉంచడంలో సహాయం చేస్తుంది. క్రమంగా చర్మం పాడవకుండా కాపాడుతుంది. మ‌రియు కందిపప్పు పొడి, పెరుగు క‌లిపి ముఖానికి అప్లై చేయాలి. ఈ రెండిటి కాంబినేష‌న్ చర్మం పొడిబారకుండా చేస్తుంది. మరియు చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: