అతివలకి ముఖ సౌందర్యం తరువాత అత్యంత ముఖ్యమైన ,శ్రద్ద పెట్టాల్సిన అందం నడుము. స్త్రీలు ఎంత అందంగా ఉన్నా నాజూకైన నడుము లేకపోతే మాత్రం ముఖ సౌందర్యం ఉన్నా లేనట్టే. అందుకే చాలా మంది సౌందర్య నిపుణులు, తప్పకుండా నడుముకి సంభందిఛిన వ్యయామాలనే అత్యధికంగా రిఫర్ చేస్తూ ఉంటారు. చాలా మంది మహిళలు నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వుతో అత్యంత అంద విహీనంగా కనిపిస్తూ ఉంటారు. మరి ఈ నడుమందం కోసం ఏమి చేయాలి..ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలని ఇప్పుడు చూద్దాం.

 

బాదం పప్పు శరీరంలో ఉన్న కొవ్వుని తగ్గించడంలో కీలకంగా ఉపయోగ పడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వుని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బాదంలో ఉండే ఒమేగా 3 యాసిడ్స్ కొవ్వుని కరిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.ప్రతీ రోజు ఉదయం వీటిని నానబెట్టుకుని తినడం వలన మంచి ఫలితం ఉంటుంది. అలాగే

 

జీలకర్ర నీరు కూడా మంచి ఫలితాలని ఇస్తుంది. ప్రతీ రోజు ఒక స్పూన్ జీలకర్ర ని తీసుకుని నీటిలో మరిగించి ఆ నీటిని త్రాగడం వలన కూడా శరీరంలో కొవ్వు కరిగి పోతుంది. ఇది పురాతన ఆయుర్వేదంలో సైతం అత్యంత ప్రాచుర్యం పొందిన చిట్కా. అంతేకాదు ఆరోగ్య పరంగా కూడా శరీరానికి ఎంతో మందిదని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: