వయసుల ఆధారంగా వెంట్రుకలు తెల్లబడుతాయి. 30 ఏళ్ళ నుంచీ వెంట్రుకలు తెల్లబడటం మొదలు పెట్టి 50 ఏళ్ళు వచ్చే సరికి సగానికి పైగానే వెంట్రులు తెల్లగా మారిపోతాయి. కానీ చాలామందికి టీనేజ్ వయసులోనే వెంట్రుకలు తెల్లబడం మనం చూస్తూనే ఉంటాం. 15 ఏళ్ళ టీనేజ్ వయసులోనే చాలామందికి వెంట్రులకు తెల్లబడం ఇప్పుడు సహజమయ్యిపోయింది. ఇలా జుట్టు తెల్లబడటానికి అసలు కారణం ఇప్పటివరకూ ఏ శాస్త్రవేత్త చెప్పలేక పోయారు. కానీ హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెల్ల జుట్టు గుట్టు విప్పారు..

 

జుట్టు తెల్లబడటానికి ప్రధానమైన కారణం కేవలం ఒత్తిడి వలనే అంటున్నారు శాస్త్రవేత్తలు. నోరాడ్రేనాలిని గా పిలవబడే ఓ హార్మోన్ శరీరం నుంచీ విడుదలఅయ్యి రక్తంలో కలుస్తుంది. వెంట్రులకలు నల్లబడటానికి కారణమైన మేలానో కైట్ ని ఇది దెబ్బ తీస్తుంది. దీని వలనే వెంట్రులకు నల్లబడుతాయని నిర్ధారించారు.

 

కేవలం ఒత్తిడి నుంచీ శరీర భాగాలని రక్షించడానికి విడుదలఅయ్యే నోరాడ్రేనాలిని ఎలుకలలో ప్రవేశపెట్టడం వలన 24 గంటల వ్యవధిలోనే సుమారు 50 శాతం వెంట్రుకలు తెల్లబడ్డాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు ఇది ఒక్క వెంట్రులకపైనే కాదు శరీర భాగాల పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. తెల్లజుట్టు రాకుండా ఉండాలన్నా లేదా ఆరోగ్యంగా ఉండాలన్నా సరే ఒత్తిడికి దూరంగా ఉండమని సలహా ఇస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: