చలికాలంలో చర్మం పొడిబారడం, చర్మం మీద పగుళ్లు ఏర్పడడం వంటివి సాధారణం. తేమ తక్కువగా ఉండడం, అనువైన దుస్తులు ధరించకపోవడం, చర్మ సంరక్షణ పద్ధతులు పాటించకపోవడమే దీనికి ముఖ్య కార‌ణాలు. కావున, సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. అయితే, మాయిశ్చరైజర్లను ఉపయోగించడం ద్వారా, చర్మాన్ని పొడిబారకుండా, పగుళ్ళకు లోనుకాకుండా కొంత వరకు నిరోధించవచ్చు. కాని, స‌హ‌జ‌సిద్ధ‌మైన మాయిశ్చ‌రైజ‌ర్ల‌ను వాడ‌డం మ‌రింత మంచిది.

 

పొడిచర్మానికి ఓట్‌ మీల్‌ సహజ విరుగుడుగా పనిచేస్తుంది. ఓట్స్‌ పౌడర్‌ను నీళ్లలో కలుపుకొని లేదా ఓట్‌మీల్‌ క్రీమ్‌ను రాసుకున్న తర్వాత స్నానం చేయాలి. ఓట్‌మీల్‌ పొడిబారిన చర్మానికి తేమను అందిస్తుంది. అరటి పండు, శీతాకాలంలో కూడా చర్మం లోపలి పొరల నుండి, పోషకాలను అందిస్తూ సహజమైన తేమ లక్షణాలను పెంపొందిస్తూ, చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయం చేస్తుంది. అర‌టి పండు, పాలు క‌లిపి ముఖానికి రాస్తే మంచి ఫ‌లితం క‌నిపిస్తుంది. నిద్ర పోయే ముందు గానీ, స్నానం తర్వాతగానీ కొబ్బరి నూనెతో ఒళ్లంతా మసాజ్‌ చేసుకోవాలి. 

 

కొబ్బరి నూనెలోని సాచురేటెడ్‌ కొవ్వు ఆమ్లాలు చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. అలాగే తేనె, పచ్చిపాలు మిక్స్ చేసి.. కాటన్ బాల్ ను డిప్ చేసి చర్మానికి అప్లై చేయాలి. తేనెలోని మాయిశ్చరైజింగ్ గుణాలు డ్రై స్కిన్ నివారిస్తుంది. బొప్పాయి, అరటిపండు, తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లే చేయాలి. బొప్పాయిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, అరటిలో ఉండే విటమిన్స్ యాంటీఏజెంట్స్ గా పనిచేస్తాయి. తేనె డ్రై స్కిన్ కు నేచురల్ గా మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. ఈ ప్యాక్ వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: