అరటి పండు తింటే ఆరోగ్యంగా ఉంటాము.. ఆరోగ్యమే కాదు అందంగా కూడా ఉంటాము. అయితే అందానికి ఈ అరటి పండుని ఎలా వాడుతారో తెలుసుకోండి.. అందంగా తయారవ్వండి.. ఈ అరటిపండు గుజ్జు చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా చేస్తుంది.. ఒక్క చర్మం ఏ కాదు జుట్టు కూడా పట్టులా మెరిసిపోతుంది. 

 

చర్మానికి పోషణ, తాజాదనాన్ని అందించేందుకు ఈ అరటిపండు ఎంతో సహాయపడుతుంది. పొడిచర్మానికి మాయిశ్చరైజ్‌ లా చేసి మృదువుగా తయారు చేస్తుంది. ఇందులో విటమిన్‌ స్కిన్‌కు తేమ అందించి, పొడిబారిన, దెబ్బతిన్న చర్మాన్ని అందంగా మారుస్తుంది. 

 

అరటిపండు చర్మం మీది మృతకణాలను తొలగిస్తుంది. అలానే చర్మంపై జిడ్డును తొలిగిస్తుంది.ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మీద గీతలు, ముడతలను తొలిగిస్తాయి.

 

ఈ పండులో విటమిన్‌ 'ఎ', జింక్‌, మాంగనీస్‌లోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అందుకే అరటిపండు తొక్క లోపలి భాగాన్ని ముఖం మీద రుద్దుకుంటే నల్లమచ్చలు యిట్టె తగ్గిపోతాయి.

 

చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి చర్మాన్ని అద్భుతంగా అందంగా తయారు చేసుకోండి.. ఒక్క అరటి పండుతో అద్భుతమైన అందాన్ని సొంతం చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: