ముఖంతో పాటు జుట్టుకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు మహిళలు. అందమైన, పొడవాటి, ఒత్తైన శిరోజాలు కావాలనే అమ్మాయిలంతా కోరుకొంటారు. ఇక హెయిర్.. స్టయిల్‌గా ఉండాటానికి యూత్ తెగ ఆరాటపడుతుంటారు. జుట్టు నల్లగా ఉంటేనే అందం అని చాలమంది బావిస్తారు. అయితే వయస్సు పెరిగే కొద్దీ కొంచెం రాలినట్లు కనిపించినా, ఏమాత్రం అనారోగ్యకర లక్షణాలు ఎదురైనా మానసిక క్షోభకు గురవుతుంటారు. అయితే మ‌నం కురుల విష‌యంలో చేసే త‌ప్పుల వ‌ల్ల కూడా అనేక జుట్టు స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి.

 

రాత్రిపూట టైట్‌గా పోనీటైల్ వేసుకోవ‌డం వ‌ల్ల జుట్టు బ్రేక్ అవుతుంది. కుదుళ్లు బ‌ల‌హీన‌మై.. జుట్టు రాల‌డానికి కార‌ణ‌మ‌వుతుంది. క్లిప్స్ కూడా టైట్ గా ఉండేవి రాత్రిపూట పెట్టుకోక‌పోవ‌డమే మంచిది. కాటన్ పిల్లో కవర్స్ ఉపయోగించడం వల్ల జుట్టు మరింత డ్రైగా మరియు డల్ గా మారుతుంది. ఇది ఆయిల్ ను అబ్జార్బ్ చేస్తుంది మరియు చర్మానికి తగిన తేమను అందిస్తుంది. రాత్రిప‌డుకోవ‌డానికి ముందు జుట్టుని దువ్వుకోకపోవడమే మంచిది. 

 

దువ్వడం కంటే మసాజ్ చేయడం వల్ల జుట్టు ఒత్తుగా మారుతుంది. న్యాచురల్ ఆయిల్ తో రాత్రి మసాజ్ చేయడం వల్ల రాత్రంతా పోషణ అందుతుంది. హెయిర్ స్టెయిటనింగ్ ఐరన్ హీట్ కర్ల్స్, మొదలగునవి హెయిర్ స్ట్రక్చర్ ను డ్రైగా మరియు డ్యామేజ్ చేస్తుంది. సో.. ఇలాంటి ఎక్కువ‌గా వాడ‌క‌పోవ‌డ‌యే మంచిది. ఏదో ఆలోచిస్తూ. .మనం జుట్టుని చుట్టుడం, ముడేయడం, లాగడం వంటి పనులు చేస్తుంటాం. కానీ.. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనంగా మారి.. జుట్టు రాలడానికి కారణమవుతుంది. ఈ హ్యాబిట్‌ను మాత్రం ముందుగా మానేయండి.
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: