దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు దృష్ట్యా దీనిని సాంబార్, ఊరగాయల వంటి మొదలైన భారతీయ వంటలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. మునగ కాయలే కాకుండా ఆకులు కూడా చాలా బలమైన ఆహారం. ఇక‌ మునగ ఆకుల కంటే మునగ కాయలను ఎక్కువగా వాడుతుంటారు. మునగలో విటమిన్ ఎ, సి, లతోపాటు క్యాల్షియం పుష్కలంగా ఉంది. అయితే మున‌గ‌కాయ‌లు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

 

మునగకాయల పౌడర్‌, తేనెను, రోజ్ వాటర్ను, నిమ్మ రసం క‌లిపి ముఖానికి ఫేస్ మాస్క్‌లా వేసుకోవాలి. ఒక పావుగంట పాటు అలా ఉంచి గోరువెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇది చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా, అందంగా తయారు చెయ్యడంలో సహాయపడుతుంది. మునగాకులతో తయారు చేసిన పేస్ట్‌ను మచ్చలు, డార్క్ స్పాట్స్ పై వాడండి. మచ్చలు, డార్క్ స్పాట్స్, పిగ్మేంటేషన్ వంటి చర్మ సంబంధమైన రుగ్మతలకు చికిత్స చేయడం ద్వారా మీ చర్మపు ఛాయను మెరుగుపరచడంలో మునగకాయలు ఉప‌యోగ‌పడతాయి. 

 

మ‌న‌గ‌కాయ‌లను పేస్ట్ చేసి అందులో కొద్దిగా ప‌సుపు క‌లిపి ముఖానికి అప్లే చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చర్మపు వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిని తరచూగా ఉపయోగించడం వల్ల ఫ్రీ రాడికల్ వల్ల నష్టం నుండి మీ చర్మాన్ని కాపాడుతుంది. అలాగే మునగకాయలు  మొటిమలు, చర్మ పగుళ్లను కలుగచేసే హానికరమైన అంశాలతో పోరాడుతుంది. మ‌న‌గ‌కాయ‌ల పేస్ట్‌లో కొద్దిగా రోజ్ వాట‌ర్ క‌లిపి ఫేస్‌కు అప్లై చేయాలి. ఇది ముఖంపై పేరుకున్న మ‌చ్చ‌లను తొల‌గిస్తుంది.

 
 

 
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: