అందం వేరు , సహజసిద్దమైన అందం వేరు. అందులోనూ ప్రకాశవంతమైన చర్మం వలన వచ్చే అందం ఇంకా వేరు.  ప్రతీ ఒక్కరూ కోరుకునేది చర్మం మెరిసిపోతూ ప్రకాశవంతమైన ముఖాన్ని కోరుకుంటారు. ఈ క్రమంలోనే ఎన్నెన్నో సౌందర్య సాధనాలు చేస్తూ అందంగా కనిపిస్తారు కానీ ముఖంలో వచ్చస్సు మాత్రం సహజసిద్ధంగా కనిపించదు, మన ప్రధాని మోడీని మీరు ఎప్పుడైనా పరీక్షించి చూశారా..ఆయన ముఖం ఎంతో ప్రకాశవంతగా మెరుస్తూ ఉంటుంది. ముఖంలో తెలియని గ్లో కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది ఆయన ముఖ సౌందర్యానికి ఎలాంటి క్రీములు వాడుతారు అంటూ ఆలోచనలు కూడా చేశారు. అయితే

 

తన ముఖం ఎందుకు ఇంతగా మెరుస్తుంది, అందుకు కారణాలు ఏమిటి అనే విషయాన్ని మోడీ వెల్లడించారు.తానూ రోజుకి నాలుగైదు సార్లు చెమట పట్టేలా పనిచేస్తాను, అందుకే నా ముఖం ఇంతగా మెరిసిపోతుంది అంటూ తన సౌందర్య  సీక్రెట్ బయటపెట్టారు. చాలా మంది తనని మీ ముఖం అంతగా ఎలా మెరుస్తోంది , అందుకు మీరు ఏమి చేస్తారు అని. అందుకు నా సమాధానం నేను చెమట పట్టేలా పనిచేస్తాను.అంతేకాదు..

 

పనిచేసినప్పుడు వచ్చిన చెమటతోనే మసాజ్ చేసుకుంటాను. ఇది మనకి మెరుపులాంటి చర్మాని ఇవ్వడమే కాకుండా సహసిద్దమైన అందాన్ని ఇస్తుంది అంటూ బ్యూటీ టిప్స్ ఇచ్చారు. ప్రధానమంత్రి బాలల పురస్కారాలు పొందిన విధ్యార్ధులతో మోడీ ముచ్చటిస్తూ వారిలో ఒకరు అడిగిన ప్రశ్నకి బదులుగా మోడీ ఈ సమాధానం చెప్పారు. అయితే చెమటతో అందం సొంతం చేసుకోవచ్చనే విషయం చాలామందికి తెలియదు, ఇలా చేయడం వలన ఆరోగ్యంతో పాటు సౌందర్యం పెరుగుతుందని మోడీ సలహాలు కూడా ఇచ్చారట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: