ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే సాధారణమైన వంట పదార్థం ఉప్పు. ఉప్పులో ఉండే సహజసిద్ధమైన ఖనిజ పదార్థాల వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఉప్పు వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో.. అది ప‌రిమితి మించితే మాత్రం అన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయి. అయితే ఆహారంలో రుచి కోసమే కాదు అందాన్ని రెట్టింపు చేసుకోవ‌డంలో కూడా ఉప్పును ఉప‌యోగించ‌వ‌చ్చు. మ‌రి ఈ ఉప్పు సౌందర్య సాధనంగా ఎలా పనిచేస్తుందో ఓ లుక్కేస్తేపోలా..!

 

ఒక కప్పు నీరు మ‌రియు ఒక టేబుల్ స్పూను సముద్రపు ఉప్పు తీసుకుని బాగా కరిగే వరకు కలపాలి. ఈ మిశ్రమంలో దూది స‌హాయంలో మొటిమ‌ల‌పై అప్లై చేయండి. ఇది చేయ‌డం వ‌ల్ల ఉప్పు నీటిలో ఉండే హీలింగ్ ప్రాపర్టీస్ మొటిమలను & పింపుల్స్ను త్వరగా నివారించడంలో మీకు బాగా సహాయపడగలదు. బ్యాక్టీరియా కారణంగా సంభవించే నోటి దుర్వాసనను కూడా ఉప్పు నీరు తగ్గిస్తుంది. ఉప్పు నీటితో మీ నోటిని శుభ్రం చేసుకోవడం వలన శుద్ధి చేసుకోవడం వలన మీ నోరు శుభ్రం అవడంతో పాటు చెడు శ్వాసను కూడా తొలగిపోతుంది. 

 

అలాగే ఆలివ్‌ నూనె, స‌ముద్ర‌పు ఉప్పు సమపాళ్లలో కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాత వేడినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మం మీది మృత కణాలు తొలగి, చర్మ కణాలకు రక్తప్రసరణ పెరుగుతుంది. సముద్రపు ఉప్పును & నీటిని బాగా తెలిపి తయారు చేసిన మిశ్రమాన్ని మీ ముఖంపై స‌ర్కిల‌ర్ మోష‌న్‌లో స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత సాధారణ నేటి తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకుంటే కాంతివంతంగా క‌నిపిస్తుంది. అలాగే గాయాలకు కూడా ఉప్పు నీరు ఎంతగానో మేలు చేస్తుంది.
 


 

మరింత సమాచారం తెలుసుకోండి: