పాలు ఎంత శ్రేష్ఠమైనవో తెలుసా? ఎన్నో పోషకాలు.. ఎన్నో విటమిన్లు.. ఎన్నో పోషకాలు ఉంటాయి.. అలాంటి ఈ పాలతో ఎన్నో లాభాలు ఉంటాయి.. అయితే ఈ పాలతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా ఉంటుంది. అయితే పాలతో అందాన్ని ఎలా సొంతం చేసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

ముఖం మీది దుమ్ము, మేక్‌పలను తొలగించేందుకు ఆవుపాలు వాడితే మంచి ఫలితం ఉంటుంది. 

 

పొడి చర్మం గల వాళ్లకి ఆవుపాలు మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. 

 

పాలు, తేనె, సీసాల్ట్‌లను కలిపితే సహజసిద్ధమైన స్క్రబ్‌ సిద్ధం అవుతుంది.. వారానికి రెండు సార్లు ఈ స్క్రబ్‌తో మర్దనా చేస్తే మెరిసిపోతారు. 

 

షాంపూ, కండిషనర్‌లు బదులు ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెను ఒక గ్లాసు పాలలో కలపాలి. ఈ మిశ్రమంతో జుట్టుకి మర్దనా చేసిన పావుగంట తరువాత నీళ్లతో ముందు కడిగి ఆ తరువాత షాంపూతో స్నానం చేయాలి.. అంతే జుట్టు మెరిసిపోతుంది. 

 

పాలు, నీళ్లు కలిపి గది ఉష్ణోగ్రత కంటే కాస్త ఎక్కువ వేడి చేసి ఆ నీళ్లలో పాదాలు పెట్టి రిలాక్స్‌ అయ్యాక పాదాలపై ఉన్న మృత చర్మాన్ని తొలగించాలి.

 

చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి మీ చర్మాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. రోజుకు ఒక గ్లాస్ పాలు తాగండి.. అందంగా తయారవ్వండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: