టొమాటో.. ప్రతి వంటలో చాలావరకు ఉండాల్సిందే.. కానీ అలాంటి ఈ టొమాటోతో అందం కూడా సాధ్యం అవుతుంది. అయితే అది ఎలా అనేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే టొమాటోతో అంత అందాన్ని సొంతం చేసుకోవచ్చు కాబట్టి. అయితే ఈ టొమాటోను అందానికి ఎలా ఉపయోగించాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

టొమాటోలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి పోషణ ఇవ్వడమే కాదు మలినాలు, ఇన్‌ఫెక్షన్లను కూడా తొలిగిస్తాయి. టొమాటో రసంని మఖానికి రాసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది. 

 

ముఖం అందంగా.. జిడ్డు లేకుండా ఉండాలి అంటే టొమాటో గుజ్జును ముఖానికి రాసుకొని ఆరిన తర్వాత కడుక్కుంటే చాలు జిడ్డు సమస్య తొలిగి తాజాదనంతో మెరిసిపోతారు.. అయితే టొమాటో రసం చర్మం మీది సహజ నూనెలను ఉంచుతుంది.. తేమను అందించి ముఖాన్ని అందంగా మారుస్తుంది. 

 

మనం ఉన్నట్టుండి అందరికి అందంగా కనిపించాలంటే ఎం చెయ్యాలి? మేకప్ వెయ్యాలి. అయితే ఆలా తరచు మేకప్‌ వేసుకొని ఎండ గాలికి తిరుగుతే ఎం అవుతుంది ? చర్మం మంట పుడుతుంది. అప్పుడు మనం వెంటనే ఎం చెయ్యాలి టొమాటో గుజ్జు రాసుకోవాలి.అంతే వెంటనే మంట తగ్గి ఆరోగ్యంగా తయారవుతాం. 

 

టొమాటో, బ్రౌన్‌ షుగర్‌ మిశ్రమం ముఖం మీది మలినాలను పొగుడుతుంది... టొమాటో చర్మం మీది మృతకణాలు, నల్లమచ్చలను తొలగిస్తాయు. 

 

టొమాటో గుజ్జును ఫేస్‌ప్యాక్‌లా వేసుకొని అరగంట తర్వాత తీసేస్తా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. 

 

చూశారుగా.. టమోటాతో ఎన్ని ఉపయోగాలో.. ఇంకెందుకు ఆలస్యం.. ఈ చిట్కాలను పాటించండి అందంగా తయారవ్వండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: