అరటి పండును ఇష్టపడని వారుండరు. భోజనానంతరం పండు తినే అలవాటు అదీ అరటిపండు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. సీజన్‌తో సంబంధం లేకుండా దొరికే పండు అరటి. అరటిలో ఆరోగ్యాన్నిచ్చే లక్షణాలెన్నున్నాయో అందాన్ని రెట్టింపు చేసే లక్షణాలు కూడా అన్నే ఉన్నాయి. అరటిపండులో మాయిశ్చర్‌ అధికం. పొటాషియం, విటమిన్‌ ఇ, సి వంటివి చర్మానికి మేలు చేస్తాయి. చ‌ర్మ‌మే కాదండోయ్ కేశాల‌కు కూడా అర‌టితో ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి..!

 

అందులో ముందుగా అర‌టిపండు పేస్ట్ చేసుకుని, అందులో కొద్దిగా నిమ్మ‌రసం పిండి జుట్టు అప్లై చేయాలి. ఒక అర‌గంట పాటు అర‌నిచ్చి త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జ‌ట్టు స్మూత్‌గా, అందంగా మారుతుంది. వాస్త‌వానికి అరటిలోని విటమిన్లు, ఖనిజాలు జుట్టు రాలడాన్ని అరికడతాయి. అరటి సహజ హెయిర్ కండీషనర్ లా పని చేస్తుంది. వెంట్రుకలు డ్యామేజీ కావడాన్ని నివారించడంతోపాటు మృదువుగా మారడానికి అరటి ఉపయోగపడుతుంది. అలాగే అరటి పండును, కొబ్బరి పాలు క‌లిపి జుట్టు ప‌ట్టించాలి. 

 

ఇది బాగా ఆర‌క త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు బ‌లంగా త‌యార‌వ‌డ‌మే కాకుండా చుండ్రు స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. అదే విధంగా అరటి గుజ్జులో ఆలివ్ ఆయిల్ క‌లిపి జుట్టుకు అప్లై చేయాలి. ఒక అర‌గంట స‌మ‌యం త‌ర్వాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ జుట్టు రాల‌డం, పొడి జుట్టు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. మ‌రియు కేవ‌లం అరటిపండు గుజ్జును కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు పట్టులా మెత్తగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: