అందంగా.. ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాల‌ని అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా కోరుకుంటారు. అమ్మాయిలు చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టే.. అబ్బాయిలు కూడా ఫీల‌వుతుంటారు. సాధార‌ణంగా మగవాళ్ల చర్మం కాస్త గరుకుగా ఉంటుంది. ఎన్ని రకాలుగా ట్రై చేసినా వాళ్ల చర్మం కాస్త హార్డ్ గా, డల్ గా కనిపిస్తూ ఉంటుంది. మ‌రియు పురుషుల చర్మం స్త్రీల చర్మం కంటే 15% ఎక్కువ ఆయిలీ గా ఉంటుంది. మ‌రి పురుషుల్లో ఆయిల్ స్కిన్ ఒక్కటే సమస్య కాదు. వారి చర్మంలో సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఆ కారంగా చర్మంలో మొటిమలు, మచ్చలు ఇతర సమస్యలకు దారితీస్తుంది. 

 

సో.. ఇలాంటి స‌మ‌స్య‌ల‌న్నిటికీ చెక్ పెట్టి.. స్కిన్ గ్లాగా క‌నిపించాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. వాస్త‌వానికి కొంద‌రు యాంటీ ఏజింగ్ ప్రాసెస్ చేయించుకుంటున్నారు. దీనిలో చాలా ర‌కాలు ఉన్నాయి. అయితే అది కాస్త ఖ‌ర్చు కూడుకున్న‌ది. కాని, అసలు వీటితో పని లేకుండా సహజంగా చర్మాన్ని కాపాడుకోవడం ఎంతో మేలు. పెరుగు, ఓట్ మీల్ పౌడర్, అలోవెరజెల్ ఈ మూడు క‌లిపి ఫేస్‌ను అప్లే చేపి.. కాసేపు మ‌సాజ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం మ‌లినాలు తొలిగి కాంతివంతంగా క‌నిపిస్తుంది.

 

నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఎందుకంటే చర్మం పొడిబారకుండా చూసుకుంటే గ్లో తగ్గకుండా ఉంటుంది. పచ్చి పాలు మరియు లావెండర్ నూనె క‌లిపి ఫేస్‌కు అప్లే చేయాలి. ఇది ఆయిల్ స్కిన్ నుంచి దూరం చేస్తుంది. టీ, కాఫీలు, ఆల్కహాల్ వీలైనంత తక్కువగా తీసుకుంటే మేలు. వీటిని ఎక్కువగా తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు ముందే వచ్చేసే చాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. రోజులో రెండు మూడు సార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి. దీనివల్ల ముఖంపై వ్యర్థాలు పేరుకోకుండా.. గ్లోగా క‌నిపించేలా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: