ఇప్పుడు కాలం బట్టి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సరే మన జుట్టు ఊడిపోతూనే ఉంటుంది. అందుకే ఆ జుట్టుకు సంబంధించి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న జుట్టు రంగు మాత్రం మారుతుంది. ఇలా జుట్టు రంగు మారటం వల్ల ప్రస్తుతం యువతీ యువకులు పడరాని కష్టాలు అన్ని పడుతున్నారు. 

 

అందుకే ఆ కష్టాలకు చెక్ పెట్టడానికి జుట్టుకు రంగు వేస్తున్నారు. ఆలా వెయ్యడం వల్ల జుట్టు మరి కాస్త దెబ్బ తింటుంది. కొందరికి అయితే ఆలా రంగులు వెయ్యటం వల్ల జుట్టు ఏ లేకుండా పోతుంది కూడా. ఇలా జుట్టుకు రంగు వెయ్యటం వల్ల సహజత్వాన్ని కోల్పోతుంది. జుట్టు దెబ్బ తింటుంది. 

 

అయితే జుట్టు రంగు వెయ్యాలి అనుకున్నవారు.. కెమికల్స్ ఉన్నవి కాకుండా అలోవెరా, గోరింటాకు, ఉసిరి, మందార ఆకులు, పువ్వులు, గుంటగలగర ఆకుల వంటి ప్రకృతి సిద్ధమైన వనరులను నేరుగానో, నూనె ద్వారానో జుట్టుకు పట్టించడం మంచిది. ఇలా చెయ్యడం వల్ల మీ జుట్టు అందం దెబ్బ తినదు. అందంగా తయారవుతారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: