అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అందంగా ఉండటం అంటే తెల్లగా మాత్ర‌మే ఉండటం కాదు. మొటిమ‌లు, మ‌చ్చ‌లు లేకుండా, కాంతివంతంగా ఉంటేనే సంపూర్ణ అందం పొందిన‌ట్టు. అందుకోసం మార్కెట్ లో దొరికే ఖరీదైన క్రీములు కొని రాసుకోవాల్సిన పనిలేదు. కేవ‌లం నిమిషాల్లోనే మీ ముఖం మెర‌వాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు. అలాగే  పైసా ఖర్చులేకుండా మీ ఇంట్లోనే ఉండి అందుబాటులో దొరికే వస్తువుల్నే వాడి మీ ముఖసౌందర్యాన్ని మరింత అందంగా మార్చుకోవ‌చ్చు. మ‌రి అవేంటో ఓ లుక్కుసేయండి.  

 

శెనగపిండి, పాలపొడి, రోజ్ వాటర్ మూడు క‌లిపి ఫేస్‌కు ప్యాక్‌లా వేసుకోవాలి. ఒక పావుగంట త‌ర్వాత గోరువెచ్చిన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల ముఖం కాంతివంగా మెరుస్తుంది. పెరుగు, ఎగ్ వైట్‌, ఉప్పు, చక్కెర కలుపుకుని మాస్కులా ముఖానికి రాసుకుని, అరగంట తర్వాత ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై పేరుకున్న మ‌లినాలు తొల‌గి ప్ర‌కాశవంతంగా క‌నిపిస్తుంది.

 

గోరువెచ్చని నీటిలో రవ్వంత ఉప్పును కలిపి ఆ నీటిలో కళ్లను తుడవండి. కళ్లలోని డల్‌నెస్‌ తగ్గి కాంతివంతంగా మెరుపు వస్తుంది. ముఖం జిడ్డుగా ఉంటే రాత్రిళ్లు గులాబీ ఆకుల్ని నీళ్లలో వేసి ఉదయం ఆ నీళ్లతో ముఖం కడుక్కుంటే కాంతివంత‌గా మెరుస్తుంది. పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని పావుగంట‌ తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా ముఖం ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: