అందంగా క‌నిపించ‌డానికి ఇటు అమ్మాయిలు.. అటు అబ్బాయిలు తెగ ప్ర‌య‌త్నిస్తుంటారు. ఈ నేప‌థ్యంలోనే ర‌క‌ర‌కాల మార్కెట్‌లో వ‌చ్చే కెమిక‌ల్ ప్రోడెక్ట్స్ వాడుతుంటారు. అయితే అవి ఇప్పుడు మీకు అందాన్ని ఇచ్చినా.. ముందు ముందు వాటి ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అయితే ఎలాంటి ఖ‌ర్చు లేకుండా కేవ‌లం ఇంట్లోనే దొరికే హోమ్‌మేడ్ ప్రోడెక్ట్స్ కూడా అందంగా మెరిసిపోవ‌చ్చు. ఇందులో భాగంగానే ఇంట్లో దొరికే అత్య‌త్త‌మైన బ్యూటి ప్రోడెక్ట్ గోధుమ పిండి. అవును! మీరు విన్న‌ది నిజమే. ఆరోగ్యానికే కాదు, అందానికి మేలు చేసే గోధుమల ప్యాక్స్ చక్కని ఫలితం ఇస్తుంది. 

 

మ‌రి ఈ గోధుమ పిండితో అందాన్ని ఎలా రెట్టింపు చేసుకోవ‌లి చూసేయండి.  గోరువెచ్చని పాలు, రోజ్ వాట‌ర్, కొద్దిగా తేనె, గోధుమ పిండి కలిపి ముఖానికి ప్యాక్ గా వేసుకుని ఆరాక కడిగేసి మాయిశ్చురైజర్ రాసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై పేరుకున్న మ‌లినాలు తొలిగి పోతాయి. అంతేకాకుండా ముఖం కాంతివంతంగా మారుతుంది. గోధుమ పిండి, నీళ్లు క‌లిపి ఫేస్‌కు అప్లే చేయాలి. చివరగా చల్లటి నీటితో పేస్ట్ ను తొలగించండి. ఈ రెమెడీను రోజుకు రెండు సార్లు యూజ్ చేస్తే మ‌చ్చ‌లు తొల‌గి, అందంగా క‌నిపిస్తాము.

 

అలాగే పాల మీగడ తో గోధుమ పిండి కలిపి ఆ పాక్ వేసుకోవాలి. ఒక పావు గంట సేపు ఆర‌నిచ్చి చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు, వాటి వ‌ల్ల వ‌చ్చే మ‌చ్చ‌లు త‌గ్గుతాయి. అలాగే గోధుమ పిండి, రోజ్ వాట‌ర్ కలిపి ముఖానికి మెడకు పట్టించి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి కడిగేస్తే జిడ్డు పోయి మొహం కాంతివంతంగా మెరుస్తుంది. చర్మంపై గోధుమపిండిని పైపూతగా వాడటం వలన చర్మకాంతి మెరుగవుతుంది. ఇంకొక్క ముఖ్య విషయం ఏంటంటే, గోధుమపిండి అన్ని రకాల చర్మాలకు బాగా సూట్ అవుతుంది. మీ చర్మ తత్త్వం ఏదైనా సరే గోధుమపిండి ద్వారా కలిగే లాభాలను మీరు పొందవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: