అందం కోసం అత్యాశకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ర‌క‌ర‌కాల కెమెక‌ల్ ప్రోడెక్ట్స్‌, ర‌క‌ర‌కాల బ్యూటి ట్రీట్‌మెంట్స్ అంటూ అధిక మొత్తంలో డ‌బ్బులు త‌గ‌లేసినా చివ‌ర‌కు కొని బెడిసికొడుతున్నాయి. అయితే తెలియాల్సిన విష‌యం ఏంటంటే ఎలాంటి అధిక ఖ‌ర్చు లేకుండా.. ఇంట్లో దొరికే ప్రోడెక్ట్స్‌తోనే మ‌న అందాన్ని రెట్టింపు చేసుకోవ‌చ్చు. అందులోనూ ముఖ్యంగా ఎగ్ మాస్క్ వేసుకుంటే ఖ‌చ్చితంగా ఫ‌లితం క‌నిపిస్తుంది. మ‌రి ఆ ఎగ్ మాస్కులు ఏంటో చూసేస్తేపోలా..!

 

ఎగ్ వైట్‌లో తేనె, నిమ్మరసం, దోసరసం క‌లిపి ముఖానికి అప్లై చేయాలి. ఒక ప‌ది నిమిషాల త‌ర్వాత చ‌ల్లిటి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ముఖం మీది మచ్చలు, కంటికింద నల్లని వలయాలు తగ్గుతాయి. అలాగే ఎగ్ వైట్‌లో అరటిపండు గుజ్జు, ముల్తానీ మట్టి వేసి బాగా కలిపి ముఖానికి ప‌ట్టించాలి. పావు గంట త‌ర్వాత కడిగితే ముఖం కాంతివంతంగా క‌నిపిస్తోంది. ముడతలు రాకుండా ఉండ‌డానికి కూడా ఈ ప్యాక్ ఎంతో చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. 

 

కోడిగుడ్డు జుట్టుకు కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఎగ్ వైట్‌ను త‌ల్ల‌కు ప‌ట్టంచ‌డం వ‌ల్ల జుట్టు పెరగడానికి అవసరమైన ప్రొటీన్‌ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా జింక్‌, సల్ఫర్‌, ఐరన్‌, పాస్ఫరస్‌, అయోడిన్‌, సెలినియం ఉంటాయి. అదే విధంగా  పచ్చసొనలో కాస్త ఆల్మండ్ ఆయిల్, అలోవేరా జెల్ కలిపి ముఖానికి అప్లే చేయాలి. ఒక పావు గంట త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటితో ముఖం క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై మొటిమ‌లు త‌గ్గుతాయి.  ముఖ్యంగా డ్రైస్కిన్ వారికి కూడా ఈ ప్యాక్ ఎంతో బాగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: