శీకాయ.. ఈ కాయ గురించి ఎవరి తెలీదు.. అందరికి తెలిసిన ఈ కాయ లాభాలు ఉపయోగించుకోవడం లేదు. అదేం అంటే టైమింగ్స్ కుదరవు అంటున్నారు. కుదరనంత పని చేస్తున్నారు. అయితే ఈ శీకాయతో అందం.. పది సార్లు బ్యూటీ పార్లర్ పోయిన దొరకదు. అన్ని సహజగుణాలు ఈ శీకాయలో ఉంటాయి. 

 

అలాంటి ఈ శీకాయను అందానికి ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. శీకాకాయ ఆరోగ్యకరమైన అందమైన జుట్టుకే కాదు మెరిసే చర్మానికి కూడా ఎంతో ఉపయోగ పడుతుంది.అయితే అది ఎలా అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. తక్కువ ఖర్చుతో అందంగా మారిపోండి. 

 

వేడినీళ్లలో కొన్ని పచ్చి పసుపు కొమ్ములు నానపెట్టి.. వాటిని పేస్ట్ లా తయారు చేసి అందులో శీకాకాయ పొడి, పాలు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి బాడీవా్‌షగా వాడితే అలర్జీలు, చర్మవ్యాధులు రావు. 

 

ఒక గిన్నెలో అర టీ స్పూను శీకాకాయపొడి, ఒక్కో టేబుల్‌ స్పూను మీగడ, బాదం పొడి, పసుపు, రెండు టేబుల్‌స్పూన్ల తేనె వేసి బాగా కలిపి ఈ పేస్టుని స్క్రబ్‌లా వాడడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం మెరిసిపోతుంది.

 

శీకాకాయల్ని నల్లగా కాల్చి పొడిచేసి దానిలో ఒక టీస్పూను వేపాకు పొడి, కొద్దిగా చల్లటి నీళ్లు పోసి ముద్దలా చేయాలి. ఈ మిశ్రమం వేడి వల్ల వచ్చే కురుపుల్ని, చెమటకాయల్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి..  

మరింత సమాచారం తెలుసుకోండి: