రోజ్ వాటర్.. అనుకుంటాం కానీ.. ఎంత అందాన్ని ఇస్తుందో ఈ వాటర్. ఆలా తీసి పట్టిస్తే చాలు చర్మం మృదువుగా అయిపోతుంది. అందంగా అవుతుంది. బయటకు వెళ్లే ముందు పట్టించుకోని వెళ్తే చర్మాన్ని దుమ్ము, దూళి, కాలుష్యం నుండి కాపాడుతుంది. అలాంటి ఈ రోజ్ వాటర్ ను ముఖానికి ఎలా ఉపయీగిస్తే ఇంకొన్ని లాభాలు ఉంటాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

ఇంట్లో చిట్కాలతో ఫేస్ ప్యాక్ చేసుకొని ముఖానికి పట్టించే వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్యాక్ లోకి రోజ్ వాటర్ కలపండి.. ఆ రోజే వాటర్ మీ మొఖాన్ని కాంతి వంతంగా తయారు చేస్తాయ్. 

 

ప్రస్తుతం పరిస్థుల కారణంగా మనకు నిద్ర చాల తక్కువ అవుతుంది. నిద్ర పోదాం అని అనుకున్న సరే నిద్రపోలేక పోతాం. అప్పుడు నిద్ర తక్కువ అయ్యి కళ్లు ఉబ్బిపోయి వాచినట్టు కనిపిస్తాయి. అలాంటప్పుడు కొద్దిగా రోజ్‌వాటర్‌తో కళ్ల మీద మసాజ్‌ చేసుకుంటే కళ్ల వాపు యిట్టె తగ్గిపోతుంది.

 

ఇంకా చర్మం ఆయిలీగా ఉన్న వారు రోజ్‌వాటర్‌తో ముఖాన్ని రోజుకు ఒకసారి శుభ్రం చేసుకుంటే చర్మ రంధ్రాలు అన్ని శుభ్రపడతాయి. అప్పుడు చర్మం ఎరుపెక్కడం తగ్గి అందంగా తయారవుతుంది. 

 

చూశారుగా.. ఈ చిట్కాలు ఉపయోగించి మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి.. అందంగా తయారవ్వండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: