దోసకాయలలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన ఖనిజాలు మరియు విటమిన్లు కూడా దీనిలో లాభిస్తాయి. అలాగే దోసకాయ వేసవిలో విరివిగా ఉపయోగించే కూరగాయ అయినప్పటికీ, అది ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. దోసకాయలతో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా సౌందర్య పోషణ కూడా చేసుకోవచ్చు. అన్ని సహజ చర్మ పరిష్కారాలలో, దోసకాయ చాలాకాలంగా విశేష పాత్ర పోషిస్తుంది.

 

విటమిన్ సి, విటమిన్ కె, ఫాస్పరస్, మెగ్నీషియం, బి -6, రిబోఫ్లావిన్, ఇనుము, సిలికా, ఫోలేట్, కాల్షియం మరియు జింక్ సమృద్ధిగా కలిగి ఉన్న దోసకాయ చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. దోసకాయ రసం, మీగ‌డ క‌లిపి ముఖానికి, మెడకు బాగా పట్టించి పదిహేను నిమిషాల పాటు ఆర‌నిచ్చి క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మృదువుగా మార్చి, తేమను చేకూర్చి, పొడిదనాన్ని నివారిస్తుంది. దోసకాయ రసం మ‌రియు రోజ్ వాట‌ర్ రెండూ క‌లిపి ఫేస్‌కు అప్లే చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మోటిమలతో పోరాడి, చర్మాన్ని తెలికబరుస్తుంది. 

 

అలాగే ఈ మాస్క్ గొప్ప చర్మ టోనర్ లా పనిచేస్తుంది. దోస‌కాయ ర‌సం, శ‌న‌గ‌పిండి, నిమ్మర‌సం క‌లిపి ఫేస్‌కు అప్లే చేయాలి. ఒక పావుగంట పాటు ఆర‌నిచ్చి గోరువెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జిడ్డును తగ్గించి యవ్వనంగా కనపడేటట్టు చేస్తుంది. దోస‌కాయ‌ర‌సం, పెరుగు, ఎగ్‌వైట్ క‌లిపి ఫేస్‌కు అప్లే చేయాలి. ఒక పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ చర్మానికి సహజ కాంతిని చేకూరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: